NTV Telugu Site icon

ముగిసిన విశ్వ‌క్రీడ‌లు…

విశ్వ క్రీడ‌లు జ‌పాన్ రాజ‌ధాని టోక్యోన‌గ‌రంలో విజ‌య‌వంతంగా ముగిశాయి.  ఒక‌వైపు క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తున్న‌ప్ప‌టికీ దానిని ఎదుర్కొంటూ క్రీడ‌ల‌ను నిర్వ‌హించారు.  రాజ‌ధాని టోక్యోలో వేగంగా కేసులు విస్త‌రిస్తున్నాయి. వాటి ప్ర‌భావం క్రీడాన‌గ‌రంపై ప‌డిన సంగ‌తి తెలిసిందే.  ప్ర‌తిరోజూ క్రీడాకారులు క‌రోనా బారిన ప‌డుతూనే ఉన్న‌ప్ప‌టికీ ప‌ట్టుద‌ల‌తో క్రీడ‌ల‌ను పూర్తిచేశారు.  ఒలింపిక్ క్రీడ‌లు అంటే హ‌డావుడి ఏ విధంగా ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  క్రీడాకారులు, ప్రేక్ష‌కుల‌తో స్టేడియాలు క‌క్కిరిసిపోయి ఉంటాయి.  కానీ, దానికి విరుద్దంగా క్రీడ‌లు జ‌రిగాయి.  ప్రేక్షకులు లేకుండానే క్రీడ‌లు ముగిశాయి.  క‌రోనా కార‌ణంగా ప్రేక్ష‌కులు ఎవ‌ర్నీ అనుమ‌తించ‌లేదు.  ఉత్సాహం నింపే ప్రేక్ష‌కులు లేక‌పోవ‌డంతో క్రీడ‌లు చ‌ప్ప‌గా సాగాయి.  ఇక చాలా మంది అథ్లెట్లు మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా ప‌త‌కాలు సాధించ‌లేక‌పోయారు.  ఎప్ప‌టిలాగే ప‌త‌కాల లిస్ట్‌లో అమెరికా ప్ర‌ధ‌మస్థానంలో నిల‌వ‌గా, చైనా రెండో స్థానంలో నిలిచింది.  ఇక ఇండియా ఈ క్రీడ‌ల్లో ఏడు ప‌తకాలు సాధించి శ‌భాష్ అనిపించుకుంది.  క‌రోనా ప్ర‌భావం నుంచి కోలుకుంటే 2024లో ఫ్రాన్స్‌లో జ‌రిగే ఒలింపిక్ గేమ్స్‌తో తిరిగి ఆ జోష్ క‌నిపించే అవ‌కాశం ఉంటుంది.  బాణ‌సంచాలో విశ్వక్రీడ‌ల‌కు ముగింపు ప‌లికారు.  

Read: “భీమ్”కు “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ బాధ్యతలు