ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై భారత్ ఓడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్ ను చైతు చేసిన భారత్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ నెల 18 న ఈ ఫైనల్స్ లో న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ పై తాజాగా ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ మాట్లాడుతూ… ‘నా అంచనా ప్రకారం ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియానే విజేతగా నిలుస్తుంది. అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగితే కోహ్లీసేన విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అందరూ బాగా ఆడితే చాలు. ఇక కివీస్ కూడా పటిష్టంగానే ఉంది అని పేర్కొన్నాడు. చూడాలి మరి ఈ జట్టు గెలుస్తుంది అనేది.