NTV Telugu Site icon

David Wiese: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్ రౌండర్..

Wd

Wd

David Wiese Announced His Retirement From International Cricket: నమీబియా క్రికెటర్ ఆల్ రౌండర్ డేవిడ్ వైస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో ఓటమి అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశారు. 39 ఏళ్ల డేవిడ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 15 వన్డేలు, 53 టీ20ల్లో 927 పరుగులు, 73 వికెట్లు తీశారు. తన చివరి మ్యాచులో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీయడమే కాకుండా బాటింగ్ లో కూడా 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అంతకుముందు నమీబియా కోసం వైస్ హీరోగా నిలిచాడు, అతను ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేయడంతో నమీబియా ఒమాన్ పైన విజయం సాధించింది.

Also Read; SCO vs AUS: స్కాట్లాండ్‌పై ఆసీస్ విజయం.. ఊపిరిపీల్చుకున్న ఇంగ్లండ్ జట్టు

ఇక మ్యాచ్ అనంతరం వైస్ మాట్లాడుతూ ” తదుపరి T20 ప్రపంచ కప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు, కాబట్టి, అంతర్జాతీయ క్రికెట్ పరంగా, నాలో ఎంత శక్తి ఉందో లేదో నాకు తెలియదు” అని అయిన రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరి అయినా సమయం అని చెప్పుకొచ్చాడు. మొదట 2013 నుంచి 2016 దక్షిణాఫ్రికాతో తన అంతర్జాతీయ కెరీర్‌ని ప్రారంభించిన వైస్, 2021 నుండి నమీబియా జట్టులో చేరాడు. T20 ప్రపంచ కప్‌లలో అతని ప్రదర్శనతో నమీబియాకు లెజెండ్‌గా మారాడు. ఇప్పుడు తన 11 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

Show comments