NTV Telugu Site icon

IND vs NZ: మెరిసిన శ్రేయాస్ అయ్యర్.. కివిస్ టార్గెట్ ఎంతంటే?

Shreyas Iyer

Shreyas Iyer

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌కు 250 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరఫున శ్రేయాస్ అయ్యర్ అత్యధికంగా 79 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్య (45) పరుగులతో రాణించారు.

Also Read:CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఓడిన జట్టు సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్ గా నిలుస్తుంది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటి పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్‌లోనే భారత్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది.

Also Read:CM Revanth Reddy: మోడీ చాలా మంచోడు.. రాష్ట్రం పట్ల సానుభూతితో ఉన్నారు కానీ.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..

వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 2 పరుగులు చేసిన తర్వాత ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ బౌలింగ్ లో LBWగా ఔటయ్యాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ (15) కూడా పుల్ షాట్ కొట్టడానికి ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత హెన్రీ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్ కావడంతో భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది. కోహ్లీ రెండు ఫోర్లతో 11 పరుగులు చేశాడు. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్స్ పడగొట్టాడు.