Site icon NTV Telugu

INDvsNZ: రెండో వన్డేకు ముందు టీమిండియాకు షాక్..భారీ జరిమానా

Shock To India

Shock To India

Team India: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ 2.22 ప్రకారం నిర్ణీత సమయం‌లో ఓవర్లు పూర్తి చేయకపోతే ఒక్కో ఓవర్‌కు 20 శాతం జరిమానా పడుతుంది. భారత జట్టు ఏకంగా 3 ఓవర్లు తక్కువగా వేయడంతో 60 శాతం ఫైన్ విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా కెప్టెన్, ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో ఈ కోత పడనుంది. ఇంతకుముందు గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 80 శాతం మ్యాచ్ ఫీజు ఫైన్‌గా చెల్లించింది టీమిండియా. నెల రోజుల గ్యాప్‌లో రోహిత్‌సేనకు రెండోసారి భారీ ఫైన్ పడడం గమనార్హం.

Delhi: ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌కు వేధింపులు.. వీడియో వైరల్

తొలి వన్డే​లో గెలిచిన జోష్​ మీదున్న టీమిండియా ప్లేయర్లు.. తమ రెండో మ్యాచ్‌ కోసం మ్యాచ్​ వేదికైన రాయ్​పుర్​లో అడుగుపెట్టారు. న్యూజిలాండ్ కూడా అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలోనే ప్లేయర్లకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ నృత్యాల నడుమ భారత్, న్యూజిలాండ్ జట్లను హోటల్‌ సిబ్బంది ఘనంగా ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన వీడియోల్ని బీసీసీఐ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేయగా ఇప్పుడవి నెట్టింట వైరల్‌గా మారాయి.

Honey Rose : చీరకట్టులో కేక పుట్టిస్తున్న బాలయ్య భామ హనీ రోజ్..

Exit mobile version