IND vsPAK Shake Hands: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తిస్థాయిలో సంబంధాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. క్రికెట్‌లో అయితే ఇరు దేశాల టీమ్స్ కనీసం షేక్ ఇచ్చుకునే పరిస్థితి కూడా కనిపించలేదు. ఈ ‘నో హ్యాండ్ షేక్’ ఆనవాయితీని టీమిండియా స్టార్ట్ చేసింది. ఆసియా కప్-2025లో పాక్‌తో తలపడిన మూడుసార్లు మన దేశ ఆటగాళ్లు దాయాది ప్లేయర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇదే తంతు మహిళల వన్డే వరల్డ్ కప్, నిన్న జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీ వరకు కొనసాగింది. అయితే, టీమిండియా అంధుల మహిళా క్రికెట్ టీమ్ మాత్రం ఈ ఆనవాయితీకి పుల్‌స్టాప్ పెట్టేసింది.
ఇక, ఆదివారం నాడు కొలంబో (శ్రీలంక)లో జరిగిన ఐసీసీ అంధుల మహిళల టీ20 వరల్డ్ కప్-2025లో భారత్, పాక్ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. మ్యాచ్ తర్వాత భారత ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ విషయం టీమిండియా క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాఫిక్ గా మారింది. అన్ని విభాగాలకు చెందిన భారత జట్లు దాయాదికి చెందిన ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తే.. అంధుల జట్టు మాత్రం ఇలా చేసిందేంటని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇదే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు కెప్టెన్లు హ్యాండ్ షేక్ ఇచ్చుకోలేదు.
Read Also: Nick Jonas: వారణాసి సినిమాపై ప్రియాంక చోప్రా భర్త ఫస్ట్ రియాక్షన్ ఇదే!
అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 135 పరుగులకే ఆలౌట్ అయింది. మెహ్రీన్ అలీ(66), బుష్రా అష్రఫ్(44) రాణించడంతో పాక్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్లు చెలరేగిపోయారు. ఏకంగా ఏడుగురిని రనౌట్ చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ దాయాది నిర్దేశించిన టార్గె్ట్ ను కేవలం 2 వికెట్ల నష్టానికి 10 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ దీపికా టీసీ (45), అనెఖా దేవి (64 నాటౌట్) అద్భుతంగా ఆడి ఆడి భారత్‌కు గెలుపును అందించారు. ఈ టోర్నమెంట్లో భారత్‌కు వరుసగా ఐదో విజయం ఇది. దీంతో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
Women Blind Cricket World Cup Colombo:.India women Blind won against Pakistan
Good to see Blind teams Hand shake. pic.twitter.com/jpjfM0XxFW— Sohail Imran (@sohailimrangeo) November 16, 2025
