NTV Telugu Site icon

టీ20 ప్రపంచకప్‌ : పాక్ మరో విజయం

టీ20 వరల్డ్‌ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది పాక్‌. న్యూజిలాండ్‌ విధించిన 135 పరుగుల టార్గెట్‌ను 5వికెట్ల ఉండగానే ఛేజ్‌ చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అయితే పాక్‌ ఫామ్‌కు కివీస్‌ నిర్దేశించిన లక్ష్యం ఏ మాత్రం సరిపోదని అంతా అనుకున్నారు. కానీ, పిచ్‌ పరిస్థితులు, వ్యూహాలు, బౌలింగ్‌లో వైవిధ్యంతో కివీస్‌ ప్రత్యర్థిని ఓడించినంత పనిచేసింది. చేజింగ్‌లో పాక్‌ ఆదిలో కాస్త తడబడినా… తర్వాత పుంజుకుంది. 18.4 ఓవర్లలో విజయాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో సోది రెండు వికెట్లు బౌల్ట్‌,సాంటర్న్‌,సౌథీ, తలో వికెట్‌ తీశారు.