యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ బి లో ఉన్న పాకిస్థాన్ జట్టు సెమీస్ కు క్వాలిఫై అయ్యింది. అయితే నిన్న ఈ టోర్నీలో పాక్ జట్టు నమీబియా జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. ఇక అనంతరం వచ్చిన నమీబియా కేవలం 144 పరుగులకే పరిమితమైంది. దాంతో ఈ ప్రపంచ కప్ లో వరుసగా నాలుగు విజయాలతో పాకిస్థాన్ నేరుగా సెమీస్ కు వెళ్ళింది. అయితే ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ లోనే భారత జట్టు పై విజయం సాధించిన పాకిస్థాన్ ఆ తర్వాత న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ అలాగే ఇప్పుడు నమీబియా జట్ల పై గెలిచి పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ప్రస్తుతం అగ్ర స్థానంలో నిలిచి గ్రూప్ బి నుండి సెమీ ఫైనల్స్ కు వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది.
గ్రూప్ బి నుండి సెమీస్ కు చేరుకున్న పాక్…
