NTV Telugu Site icon

India vs Australia T20 Match: డూ ఆర్ డై ఫైట్.. ఉప్పల్ వేదికగా నేడు కీలక మ్యాచ్..

India Vs Australia T20 Match

India Vs Australia T20 Match

India vs Australia T20 Match: నేడు ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా మ్యాచ్‌ జరగనుంది. ఇక మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భాగంగా తొలి టీ20లో ఆసిస్‌.. రెండో టీ20లో భారత్‌ విజయం సాధించడంతో సిరీస్‌ 1-1తో సమమైంది. కాగా.. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మ్యాచ్‌ కోసం ఉప్పల్‌ స్టేడియం వేదికైంది. దీంతో.. ఈ ఉత్కంఠ పోరును తిలకించేందుకు క్రికెట్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నేడు రాత్రి 7గంటల 30 నిమిషాలకు జరిగే మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇప్పటికే మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించగా.. నాగపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో హైదరాబాద్‌లో జరిగే టీ20లో ఎవరు గెలిస్తే వాళ్లు సిరీస్ కైవసం చేసుకుంటారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టించనుంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు అందుకున్న తొలి జట్టుగా రోహిత్ సేన నిలవనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ నెలకొల్పిన రికార్డును టీమిండియా బద్దలు కొట్టనుంది. ఇప్పటివరకు ఈ ఏడాది మొత్తం 28 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్ 20 విజయాలను నమోదు చేసింది.

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇవాళ సర్‌ప్రైజ్​ ఇవ్వనున్నాడు. నేడు మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా లైవ్‌లోకి వచ్చి‌ సర్‌ప్రైజ్‌ను ధోనీ రివీల్ చేయనున్నాడు. సాధారణంగా ధోనీ సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్‌గా వుండే ధోనీ చాలా అరుదుగా పోస్టులు చేస్తుంటాడు. ఫేస్‌బుక్‌లో మాత్రం అప్పుడప్పుడు పోస్టులు పెట్టి అభిమానులను ఉత్సాహపరుస్తుంటాడు. ఇవాళ లైవ్ లో ఓ సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పి అభిమానులను సందేహంలోకి నెట్టాడు. ఇంతకీ ధోనీ చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏమై ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చినవారికి వీలుగా రేపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు స్పెషల్ మెట్రో రైలు సర్వీసులు నడవనున్నాయి. అంతేకాకుండా.. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపధ్యంలో ప్రయాణీకుల సౌకర్యం కోసం సిటీ బస్సు సర్వీసులను పొడిగించింది. దీంతో.. ఉప్పల్ స్టేడియం నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది.
Ankita Bhandari Case: అంకితా భండారీ హత్య.. పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు