Pat Cummins: ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తుది 15 మంది జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ప్రొవిజనల్ స్క్వాడ్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా తాజాగా తుది జట్టును వెల్లడించింది. ఈ జట్టులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో బాధపడుతున్న కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకున్నారు.
Read Also: Aishwarya Rajesh : డోర్ మూసేసి..బాడీ చూపించమన్నాడు..గతాన్ని గుర్తుచేసుకుని ఏడ్చేసిన ఐశ్వర్య రాజేష్!
షార్ట్, స్మిత్ ఔట్:
ప్రొవిజనల్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న మ్యాట్ షార్ట్‌ను తుది జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో మ్యాట్ రేన్‌షాను ఎంపిక చేశారు. మరోవైపు అనుభవజ్ఞుడు స్టీవ్ స్మిత్‌కు ఈసారి వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు, ఇది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
Read Also: భారత మార్కెట్‌లోకి Haier Lumiere Colourful 4 Door Refrigerator.. దీని ప్రత్యేకత, ధర ఏంటంటే..?
కెప్టెన్‌గా మార్ష్:
ఈ మెగా టోర్నమెంట్లో మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్లతో పాటు అనుభవజ్ఞులైన బౌలర్లు, పవర్ హిట్టర్లు జట్టులో ఉండడంతో ఆసీస్ మరోసారి టైటిల్ కోసం గట్టిగా పోటీ పడనుంది.
ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానొల్లి, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, క్యామరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మ్యాట్ కూనెమన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాట్ రేన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా
