T20 World Cup 2026: గ్రూప్-బిలో తీవ్ర పోటీ.. సూపర్-8 బెర్త్ రేసులో జింబాబ్వే, ఆస్ట్రేలియా ఇంటికేనా?
- ఆసక్తికరంగా గ్రూప్-బిలో సూపర్-8 పోరు
- సూపర్ 8కు దూసుకెళ్లిన శ్రీలంక
- సూపర్-8 బెర్త్ కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా ఛాన్సెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zimbabwe and Australia Super 8 Qualification Chances: టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-బిలో సూపర్-8 పోరు ఆసక్తికరంగా మారింది. శ్రీలంక వరుసగా మూడో విజయం సాధించి సూపర్ 8కు దూసుకెళ్లింది. అప్పటికే జింబాబ్వే చేతిలో షాక్ తిన్న ఆస్ట్రేలియా.. శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలై సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి సూపర్-8 రేసులో ఉంది. సూపర్-8 దశకు చేరేందుకు జట్ల మధ్య సమీకరణాలు చివరి మ్యాచ్‌లపై ఆధారపడి ఉండటంతో.. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ప్రతి మ్యాచ్ ఫలితం గ్రూప్ పట్టికను పూర్తిగా మార్చే పరిస్థితి ఉంది.
జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించాలంటే.. ఈరోజు కొలంబోలో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాలి. ఐర్లాండ్‌పై విజయం సాధిస్తే జింబాబ్వే నేరుగా తదుపరి దశకు చేరుతుంది. అప్పుడు మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా లీగ్ దశ నుంచే ఇంటిదారి పడుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అవకాశాలు మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. మొదట జింబాబ్వేను ఐర్లాండ్ ఓడించాలి. అప్పుడే ఆసీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్‌లో ఒమన్‌ను తప్పక ఓడించాలి.
Also Read
- Rohit Sharma: హిట్‌మ్యాన్ హిస్టరీ.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..
- APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్‌కు భారీ ఏర్పాట్లు
- IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా..
- Hashmatullah Shahidi: భారత్‌పై కెప్టెన్ చారిత్రాత్మక శతకం... ఒంటరి పోరాటంతో సరికొత్త రికార్డు..
Also Read: AP New DWCRA Schemes 2026: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాల ప్రారంభం!
అంతేకాదు ఫిబ్రవరి 19న జింబాబ్వేపై శ్రీలంక గెలవాల్సి ఉంటుంది. ఇదంతా జరిగితేనే ఆస్ట్రేలియా సూపర్-8లోకి ప్రవేశిస్తుంది. జింబాబ్వే తన తదుపరి రెండు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా సూపర్-8 దశకు చేరుకుంటుంది. మంచి ఫామ్ మీదున్న ఐర్లాండ్, శ్రీలంకలపై జింబాబ్వే ఎలా ఆడుతుందో ఇప్పుడు చూడాలి. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు ఓడిన ఐర్లాండ్ జట్టుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సమీకరణాల వల్ల గ్రూప్-బి ప్రస్తుతం టోర్నీలోనే అత్యంత డ్రామాటిక్ గ్రూప్‌గా మారింది. ఒక్క మ్యాచ్ ఫలితం పట్టికను పూర్తిగా మార్చే అవకాశం ఉండటంతో.. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: హిట్‌మ్యాన్ హిస్టరీ.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..
-
APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్‌కు భారీ ఏర్పాట్లు
-
Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
-
Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపించి నిజమే: మాజీ ఉగ్రవాది..
-
Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!