Site icon NTV Telugu

SRH vs LSG: ముగిసిన సన్‌రైజర్స్ బ్యాటింగ్.. లక్నోకి స్వల్ప లక్ష్యం

Srh Score Innings

Srh Score Innings

Sunrisers Hyderabad Scored 121 Runs Against Lucknow Super Giants: శుక్రవారం ఏకన స్పోర్ట్స్ సిటీ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్.. మొదటి నుంచే నిరాశజనకమైన ప్రదర్శనని కొనసాగించింది. ఓపెనర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ (31) ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తే.. మిగతా వాళ్లు దారుణమైన ఆటతీరు కనబరిచారు. భారీ అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ ఎయిడెన్ మార్ర్కమ్ అయితే.. గోల్డోన్ డక్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. అతనితో పాటు అత్యంత ఖరీదైన ఆటగాడైన (రూ.13.25 కోట్లు) హ్యారీ బ్రూక్ కూడా మరోసారి నిండా ముంచేశాడు. నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతగాడు.. మూడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

Youtube Fraud: యూట్యూబ్ చానల్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో భారీ మోసం.. మహిళకు రూ.8 లక్షల టోకరా

మధ్యలో రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ కలిసి.. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు కానీ, భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. ఎక్కువ బంతులను వృధా చేసేశారు. టీ20 మ్యాచ్‌లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడటం వల్ల.. సన్‌రైజర్స్ స్కోరు బోర్డు ముందుకు కదల్లేదు. చివర్లో వచ్చిన అబ్దుల్ సమద్ (10 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సహాయంతో 21 పరుగులు) కాస్త మెరుపులు మెరిపించడంతో.. సన్‌రైజర్స్ స్కోరు 121కి చేరగలిగింది. లక్నో లాంటి జట్టుకి ఈ ఇది స్వల్ప లక్ష్యమే. ఇక లక్నో బౌలర్ల విషయానికొస్తే.. కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లతో విజృంభించాడు. అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు. లక్ష్యం స్వల్పంగానే ఉంది కాబట్టి.. సన్‌రైజర్స్ గెలుపొందడం కష్టమే. బౌలర్లు ఏదైనా మ్యాజిక్ సృష్టిస్తే చెప్పలేం కానీ, లేకపోతే ఆశలు వదులుకోవాల్సిందే!

Rudrudu Trailer: లారెన్స్ అన్నా.. ఈసారి ఆత్మలేవీ తీసుకురాలేదానే

Exit mobile version