NTV Telugu Site icon

SRH IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. నలుగురు భారత ఆటగాళ్లపై వేటు! బ్రూక్‌, ఫిలిప్స్ ఔట్

Untitled Design

Untitled Design

Sunrisers Hyderabad plans to release these players ahead of IPL 2024: ఐపీఎల్ 2023లో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన సన్‌రైజర్స్ పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 4 విజయాలు మాత్రమే అందుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ జట్టుకు ఇది అత్యంత చెత్త ప్రదర్శన. ఐపీఎల్ 2023కి కొత్త కెప్టెన్, మంచి ప్లేయర్స్, సూపర్ స్టాఫ్ ఉన్నా.. సన్‌రైజర్స్ రాత మాత్రం మారలేదు. దాంతో మరోసారి ప్రక్షాళన చేసే ఆలోచన ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.

కోట్లు ఖర్చు పెట్టి (రూ.13.25 కోట్లు) కొన్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ మెరుపులు ఒకటి రెండు మ్యాచులకే పరిమితం అయ్యాయి. 11 మ్యాచ్‌ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలకు బ్రూక్ కారణం అని చెప్పాలి. ఇక రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన భారత స్టార్ బ్యాటర్ మనీశ్ పాండే దారుణంగా విఫలమయ్యాడు. రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఇండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ చెత్త ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో గాయంతో మధ్యలోనే వైదొలిగాడు. ఏడు మ్యాచ్‌లే ఆడిన సుందర్.. 60 పరుగులు, మూడు వికెట్లు మాత్రమే తీసాడు.

భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ తన స్థాయికి తగ్గట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో కూడా రాణించలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో 270 రన్స్ చేశాడు. భారత ఆటగాళ్లు రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ ఒకటి రెండు మ్యాచ్‌లు పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత తేలిపోయారు. ఉమ్రాన్ మాలిక్‌ 8 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీసాడు. టీ నటరాజన్, నితీశ్ కుమార్ రెడ్డిలు కూడా దారుణంగా విఫలమయ్యారు. మరోవైపు విదేశీ ఆటగాళ్లు గ్లేన్ ఫిలిప్స్, ఫజలక్ ఫరూకీ, అకీల హోస్సెన్, మార్కో జాన్సెన్‌లు కూడా ప్రభావం చూపలేకపోయారు. దాంతో ఈ ఆటగాళ్లను వదులుకునేందుకు సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

గుడ్‌ బై చెప్పే ప్లేయర్స్ వీరే:
మయాంక్ అగర్వాల్‌
ఉమ్రాన్ మాలిక్
టీ నటరాజన్
నితీశ్ కుమార్ రెడ్డి
హ్యారీ బ్రూక్‌
గ్లేన్ ఫిలిప్స్
ఫజలక్ ఫరూకీ
అకీల హోస్సెన్
మార్కో జాన్సెన్‌