Site icon NTV Telugu

IPL 2022 : సన్‌రైజర్స్‌ ఘోర పరాజయం..

ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ రోజు ఐపీఎల్ -2022లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతున్నాయి. అయితే టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బాట్స్‌తో తొలుత బరిలోకి దిగి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 211 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్‌లో తేలిపోయిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా రాణించకపోవడంతో అభిమానుల్లో నిరాశ నింపింది. 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులకే పరిమితమైంది. 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ చిత్తుగా ఓడింది.

Exit mobile version