Sunny Bhanushali Reveals Story Behind Virat Kohli New Tattoo: ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి టాటూలంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే అతడు తన శరీరంపై కొన్ని పచ్చబొట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు.. కోహ్లీ మరో కొత్త టాటూతో కనిపించాడు. దీంతో.. ఈ టాటూ అర్థం ఏమిటి? దాని ప్రత్యేకత ఏంటి? అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. కోహ్లీకి టాటూ వేసిన ప్రముఖ కళాకారుడు, ఏలియన్స్ టాటూ వ్యవస్థాపకుడు సన్నీ భానుశాలి స్పందించాడు. అన్ని విషయాల పరస్పర అనుసంధానాన్ని, సృష్టి మూలాన్ని సూచించేలా ఆ టాటూ వేశామని.. ఉన్నతమైన వాటిని, ఏకత్వాన్ని, జీవిత నిర్మాణాన్ని, ఇతర విషయాల మూలాలను తెలియజేస్తూ, కోహ్లీ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా దాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దామని వివరించాడు.
Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ పెళ్లి.. అంత చిన్న అమ్మాయితోనా..?
ఈ టాటూను చూసి కోహ్లీ మురిసిపోయాడని, అతనికి ఇది చాలా బాగా నచ్చిందని కూడా సన్నీ భానుశాలి చెప్పుకొచ్చాడు. ఈ టాటూ అతనికి ఎంతో విలువైంది కావడంతో.. తాను చాలా శ్రమించి, మనసుపెట్టి అంకితభావంతో రూపొందించానని అన్నాడు. టాటూలో ప్రతీది అద్భుతంగా పర్‌ఫెక్ట్‌గా వచ్చిందని.. రెండు రోజుల పాటు రెండు చోట్లకు వెళ్లి తాను కోహ్లీకి ఈ టాటూ వేశానని తెలిపాడు. తొలిరోజు ముంబైలోనే కోహ్లీ అపాయింట్‌మెంట్ ఇచ్చాడని, ఆ తర్వాత మరో రోజు బెంగళూరుకు వెళ్లి టాటూ పూర్తి చేశానని చెప్పాడు. టాటూ కోసం ఎన్ని గంటలు పట్టినా.. కోహ్లీ చాలా సహనంతో ఉన్నాడని, అసలు ఒక్క క్షణం కూడా అలసిపోయినట్లు కన్పించలేదని పేర్కొన్నాడు. టాటూ వేసిన తర్వాత.. దాన్ని చూసుకొని కోహ్లీ మైమరచిపోయాడన్నాడు. ఈ టాటూ జీవితకాలం కోహ్లీతోనే ఉంటుందని, ఆ విషయం అతనికి కూడా తెలుసని అన్నాడు.
Disha Patani: విప్పి చూపించడంలో నీ తరువాతే పాప.. ఎవరైనా
తమ టాటూలు నచ్చి కోహ్లీ స్వయంగా తమ స్టూడియోకి వచ్చాడని.. తమ పనితీరును తెలియజేసే ఫొటోలతో తమ వద్దకు వచ్చాడని సన్నీ వివరించాడు. తన టాటూలకు తాను పెద్ద అభిమానినని కోహ్లీ చెప్పాడని.. క్రికెట్‌లో సూపర్‌స్టార్ అయిన కోహ్లీ, ఇంత సింపుల్‌గా ఉంటారని తాను ఊహించలేదని అన్నాడు. అసలు కోహ్లీలో గర్వం లేదని, చాలా ఒదిగి ఉంటారని, సాధారణ వ్యక్తిలాగే ప్రవర్తిస్తాడని కొనియాడాడు. తన పాత టాటూను కవర్ చేస్తూ కొత్త టాటూ వేయాలని కోరగా.. తాను ఆ టాటూ వేసినట్టు సన్నీ చెప్పుకొచ్చాడు.