NTV Telugu Site icon

టాస్ విషయంలో ఐసీసీ ఆలోచించాలి అంటున్న గవాస్కర్…

ప్రపంచ కప్ టోర్నీలో టాస్ ఓ సమస్యగా ఉంది అని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే ఈ టోర్నీలో సెకండ్ బ్యాటింగ్ చేసిన వారికి లాభం ఉంటుందని చెప్పారు. ఇది ఐసీసీకి ఓ సమస్య చెప్పిన ఆయన.. దీని పై ఐసీసీ చర్చించాలని… రెండు జట్లకు మైదానం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలని గవాస్కర్ తెలిపారు. అయితే నిన్న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ ముందు భారీ లక్ష్యమే ఉన్న… వారు దానిని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే చేధించారు. ఇక ఈ మ్యాచ్ లో మంచు ప్రభావం అంతగా లేదు అని చెప్పిన గవాస్కర్ ముందు మ్యాచ్ లలో భారీగా ఉంది అన్నారు. అలాగే ఇదే విషయాన్ని భారత కోచింగ్ స్టాఫ్ కూడా సూచించింది అని పేర్కొన్నారు. ఇక ఈ టోర్నీలో కూడా ఆడిన మ్యాచ్ లలో రేండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్ లు గెలిచాయి అని పేర్కొన్నారు.