Site icon NTV Telugu

T20 World Cup: ఐర్లాండ్‌పై శ్రీలంక సునాయాస విజయం

Srilanka

Srilanka

T20 World Cup: హోబర్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో సులభంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (34), హ్యారీ టెక్టార్ (45) రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. ఫెర్నాండో, లహిరు కుమార, కరుణరత్నె, ధనుంజయ డిసిల్వ తలో వికెట్ సాధించారు.

Read Also: Team India: విరాట్ కోహ్లీకి అక్టోబర్ సెంటిమెంట్.. సెంచరీ చేయడం ఖాయమా?

129 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను ఏ దశలోనూ ఐర్లాండ్ ఇబ్బంది పెట్టలేకపోయింది. ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కుశాల్ మెండిస్ (68 నాటౌట్), ధనంజయ డిసిల్వ (31) అదరగొట్టారు. అసలంక 31 పరుగులు చేశాడు. దీంతో 15 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తంగా క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సూపర్ 12లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ అన్ని విభాగాల్లో విఫలమైంది.

Exit mobile version