NTV Telugu Site icon

Commonwealth Games: ఫైనల్స్‌కి దూసుకెళ్లిన శ్రీహరి.. పతకం సాధిస్తే ఆ రికార్డ్ సొంతం

Srihari Nataraj Cwg

Srihari Nataraj Cwg

Srihari Nataraj Books Final Berth In Men 100m Backstroke: బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో శ్రీహరి నటరాజ్ (21) స్మిమ్మింగ్‌లో ఫైనల్స్‌కి దూసుకెళ్లాడు. సెమీస్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో అతను 54.55 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేశాడు. దీంతో అతడు తుది పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్‌లో తన హీట్స్‌లో నాలుగో స్థానంలో ముగించిన నటరాజ్.. మెడ‌ల్ ఈవెంట్ కోసం జ‌రిగే ఫైన‌ల్స్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. ద‌క్షిణాఫ్రికా స్విమ్మర్ పీట‌ర్ కోట్జ్ 53.67 సెక‌న్లతో సెమీస్‌లో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఆదివారం తుదిపోరు జరగనుంది.

బెంగళూరుకి చెందిన శ్రీహరి.. ఫైనల్స్‌లో పతకం సాధిస్తే ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన రెండో భారత స్విమ్మర్‌గా చరిత్రపుటలకెక్కుతాడు. 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్విమ్మింగ్‌లో ప్రశాంత కర్మాకర్ కాంస్య పతకం నెగ్గాడు. ఆ తర్వాత మళ్ళీ స్విమ్మింగ్‌లో ఏ భారతీయ అథ్లెట్ పతకం సాధించలేదు. అయితే.. శ్రీహరి ఫైనల్‌లో పతకం సాధించాలంటే, చాలా కష్టపడాల్సి ఉంటుంది.

సెమీస్‌లో అత్యుత్తమ టైమింగ్‌ని నమోదు చేసిన స్విమ్మర్లు ఉన్నారు కాబట్టి.. వాళ్లని అధిగమించేలా సత్తా చాటాలి. ఇప్పటివరకూ శ్రీహరి తన కెరీర్‌లో నమోదు చేసిన అత్యుత్తమ సమయం 53.77 సెకన్లు. ఇప్పుడు సెమీస్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్న పీటర్ కోడ్జ్ సమయం 53.67 సెకన్లు. కాబట్టి.. శ్రీహరి తన టైమింగ్‌ని కాస్త మెరుగుపరుచుకుంటే.. పతకం నెగ్గడం తథ్యం.