Site icon NTV Telugu

IPL 2022 : ఆరెంజ్‌ ఆర్మీ దూకుడు.. ఆర్సీబీపై విజయం..

Srh

Srh

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఈ రోజు మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. నాలుగు విజయాలతో దూసుకుపోతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ పట్టిష్టమైన ఆర్సీబీతో తలపడనుంది. ముంబైలోని బ్రబోర్న్‌ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిని ఆరెంజ్‌ ఆర్మీ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 68 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి అందరినీ షాక్‌కు గురిచేసింది. బౌలర్లు జానెస‌న్‌, న‌ట‌రాజ‌న్‌లు ఆర్‌సీబీ బ్యాట‌ర్లకు చుక్కలు చూపించారు. జానెస‌న్, న‌ట‌రాజ‌న్ చెరో మూడు వికెట్లు సాధించ‌గా, సుచిత్ రెండు, ఉమ్రాన్ మాలిక్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్ త‌లా వికెట్ సాధించారు. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో సుయాష్ ప్రభుదేసాయి 15 ప‌రుగులతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయితే 69 ప‌రుగుల స్వల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ వ‌రుస‌గా ఐదో విజ‌యం సాధించింది.

ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌47 ప‌రుగుల‌తో దుమ్మురేపాడు. ఇక అంత‌క‌ముందు బ్యాటింగ్ చేసిన 68 ప‌రుగుల‌కే ఆర్‌సీబీ కుప్ప‌కూలింది. జానెస‌న్‌,న‌ట‌రాజ‌న్ దెబ్బ‌కు ఆర్‌సీబీ బ్యాట‌ర్లు విలవిలాడారు. జానెస‌న్, న‌ట‌రాజ‌న్ చెరో మూడు వికెట్లు సాధించ‌గా, సుచిత్ రెండు, ఉమ్రాన్ మాలిక్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్ త‌లా వికెట్ సాధించారు. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో సుయాష్ ప్రభుదేసాయి 15 ప‌రుగులతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

Exit mobile version