గుజరాత్ ఓటమి తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ అఫీషియల్ గా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమికి కారణం ప్రధానంగా పవర్ ప్లే అనే చెప్పొచ్చు.మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సమయంలో ఫ్యాట్ కమిన్స్ మాట్లాడుతూ…మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. బౌలింగ్ సమయంలో 20-30 పరుగులు అదనంగా ఇచ్చాము. ఫీల్డింగ్‌లో కొన్ని కీలక క్యాచ్‌లను వదిలేశామని కమిన్స్ అన్నాడు. అయితే అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాం. ఇప్పుడున్న జట్టుతోనే మరో మూడేళ్లు ఆడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కచ్చితంగా బలంగా తిరిగొస్తామన్నాడు కమిన్స్. అయితే జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని కమిన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఫ్యాన్స్ ని భావోద్వేగానికి గురి చేసింది.
Also Read : Shubman Gill: అంపైర్తో శుభ్‌మన్ గిల్ గొడవ.. అసలు ముచ్చట ఏమిటంటే..?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమికి పవర్ ప్లే దెబ్బ కొట్టింది. పవర్ ప్లే లో బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్ , శుభ్‌మాన్ గిల్ పవర్‌ప్లేలో 8 బంతుల్లో 7 ఫోర్లు కొట్టి జట్టుకు ఘనమైన ఆరంభాన్ని అందించారు. ఫలితంగా పవర్ ప్లేలో 82 పరుగులు నమోదయ్యాయి. శుభ్‌మాన్ గిల్ 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోస్ బట్లర్ 64 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ 48. వాషింగ్టన్ సుందర్ 21 పరుగులు చేశాడు. హైదరాబాద్ తరఫున జయదేవ్ ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా, పాట్ కమ్మిన్స్, జీషన్ తలా ఒక వికెట్ తీశారు. 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్ 20 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జట్టుకు భారీ నష్టం కలిగించింది. దీంతో అభిషేక్ శర్మ ఆచితూచి ఆడాడు. అభిషేక్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 74 పరుగులు చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో స్కోర్ ముందుకు సాగలేదు. కెప్టెన్ పాట్ కమిన్స్ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విధంగా హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులకే పరిమితమైంది.
Also Read : Virat Kohli: హాట్ బ్యూటీ ఫొటోకి లైక్.. నెట్టింటా రచ్చ.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ
