Site icon NTV Telugu

Pat Cummins: పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన సన్ రైజర్స్ కెప్టెన్…

Pc

Pc

Pat Cummins Playing Cricket With School Children: ఐపీల్ 2024 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌ కి అడుగుపెట్టింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకూ చెరొక పాయింట్‌ వచ్చింది. దీనితో ఎస్‌ఆర్‌హెచ్‌ 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే 2020 తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి. ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో టీం రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళింది. అందులో భాగంగా టీం కెప్టెన్ పాట్ కమ్మిన్స్ హైదరాబాద్లో ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Also Read: Anil Kumble: బౌలర్లను కాపాడండి.. యువకులు బౌలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోరు!

గత మూడు సంవత్సరాలు చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్ రాబట్ట లేకపోయింది. 2021, 2022 సీజన్‌లలో 8వ స్థానంలో నిలిచింది. 2023 సీజన్‌లో అయితే ఏకంగా పదో స్థానంలో నిలిచి అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 కోసం జరిగిన వేలంలో కావ్య కాసులు కుమ్మరించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్ల కోసం పోటీ పడింది. ప్యాట్ కమిన్స్ కోసం అయితే ఏకంగా 20 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ట్రావిస్ హెడ్‌‌ను రూ. 6.80 కోట్లకు దక్కించుకుంది. ఇక ఈ ఆసీస్ ప్లేయర్స్ ఇద్దరు తమ ఆట తీరుతో ఎస్‌ఆర్‌హెచ్‌ ని ప్లేఆప్స్ కి వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.

Exit mobile version