Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports South Africas Grand Victory Over England

T20 world cup : ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ..అయినా ఇంటికే !

Published Date :November 7, 2021 , 7:05 am
By Lakshmi Narayana
T20 world cup : ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ..అయినా ఇంటికే !
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీ-20 వరల్డ్‌ కప్‌ సూపర్‌-12లో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో… వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రిక ఘన విజయం సాధించాయి. కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సత్తా చాటి సెమీస్‌లో అడుగు పెట్టగా.. నెట్‌రన్‌రేట్‌ కారణంగా సౌతాఫ్రిక ఇంటిదారి పట్టింది.

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రెండూ బలమైన జట్లే. ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచిన ఇరు జట్లలో.. ఒకే టీంకు మాత్రమే సెమీస్‌లో చోటు దక్కింది. సమాన విజయాలతో సెమీస్‌ కోసం బరిలోకి దిగిన రెండు జట్లు.. తమ ప్రత్యర్థి జట్లపై విజయం సాధించాయి. అయితే నెట్‌రన్‌రేట్‌ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్‌కు దూసుకెళ్లింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రిక గెలుపొందింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

డస్సెన్ 94 పరుగులు, మార్‌క్రమ్‌ 52 పరుగులతో రాణించారు. ఆరువాత 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ఇంగ్లాండ్‌కు 14 పరుగులు అవసరం కాగా కేవలం మూడు పరుగులు మాత్రమే సాధించగలిగింది. రబాడ అద్భుతంగా బౌలింగ్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సత్తా చాటింది.

వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక సమయాల్లో తానెంత ప్రమాదకరంగా ఆడతాడో మరోసారి డేవిడ్‌ వార్నర్‌ నిరూపించాడు. 89 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌.. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్‌ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించిది. నెట్ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండడంతో ఆసీస్‌ సెమీస్‌లోకి అడుగు పెట్టింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • england
  • South Africa
  • T20 World Cup 2021

తాజావార్తలు

  • Redmi A7 Pro: 6,000mAh బ్యాటరీ, 6.9-అంగుళాల డిస్‌ప్లేతో.. రెడ్‌మీ A7 ప్రో విడుదల

  • Digital Payments: ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. నేటి నుంచి OTP ఒక్కటే ఎందుకు పని చేయదు?

  • Tiger Scare: పోలవరం ప్రాంతంలో పులి సంచారం కలకలం.. రామదుర్గం కొండపై సందర్శకులు ఆందోళన!

  • Allahabad High Court: భర్త చనిపోయినా భార్యను పోషించాల్సిందే.. ‘‘భరణం’’పై కీలక తీర్పు..

  • APSPDCL Scam: ఏపీఎస్‌పీడీసీఎల్‌లో భారీ అవకతవకలు.. 69 మంది అవుట్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions