Site icon NTV Telugu

క్వింటన్ డికాక్ సెంచరీ

భారత్‌తో జరుగుతున్న నామమాత్రపు చివరి వన్డేలో దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ శతకంతో అదరగొట్టాడు. 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్న డికాక్.. సంయమనంతో ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. అదే ఊపుతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో డికాక్‌కు ఇది 17 సెంచరీ కాగా, ఇండియాపై ఆరోది. క్రీజులో అతడికి తోడుగా డుసెన్ ఉన్నాడు. డుసెన్‌ కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లను ఎలాంటి తడబాటు లేకుండా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నారు. కాగా భారత బౌలర్లలో దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు తీసుకోగా, బుమ్రా ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

Exit mobile version