Site icon NTV Telugu

WTC Final 2025: చరిత్ర సృష్టించే దిశగా సౌతాఫ్రికా.. 69 పరుగుల దూరంలోనే సఫారీ జట్టు..

Icc

Icc

WTC Final 2025: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించే దిశగా సౌతాఫ్రికా అడుగులు వేస్తుంది. లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో సఫారీ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై మూడోరోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శుక్రవారం 282 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన సౌతాఫ్రికామూడో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఐడెన్ మార్‌క్రమ్‌ (159 బంతుల్లో 11×4, 102 పరుగులు), బవుమా (121 బంతుల్లో 5×4 65 పరుగులు) జట్టును గెలుపు దిశగా తీసుకెళ్తున్నారు. దీంతో చరిత్రాత్మక విజయానికి దక్షిణాఫ్రికా జట్టు మరో 69 పరుగుల దూరంలో ఉంది. కాగా, అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 207 రన్స్ కి ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్‌ (58 నాటౌట్‌) రాణించాడు.

Read Also: Trump: ఇరాన్‌పై దాడులు సరైనవే.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ మద్దతు

అయితే, లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు తొలుత తడబడింది. పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌(2/53) బౌలింగ్ ధాటికి మూడో ఓవర్లోనే దక్షిణాఫ్రికా మొదటి వికెట్‌గా రికిల్‌టన్‌ (6) అవుట్ అయ్యాడు. దీంతో మార్‌క్రమ్, ముల్డర్‌ (27) నిలకడగా బ్యాటింగ్ చేస్తుండగా 70 పరుగుల వద్ద మరోసారి స్టార్కే.. ఆస్ట్రేలియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆఫ్‌స్టంప్‌ లైన్‌లో పడిన ఓ ఫుల్‌ బంతిని డ్రైవ్‌ చేయబోయిన ముల్డర్‌.. లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కాగా, రెండు వికెట్లు కోల్పోయినా మార్‌క్రమ్‌ మాత్రం సెంచరీ చేయగా.. మరోవైపు ఆరంభంలో బవుమా కొత ఇబ్బంది పడినా.. ఆ తర్వాత మాత్రం ఆసీస్ బౌలర్లకు ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఇక, ఎన్నాళ్లో నుంచో ఐసీసీ ప్రపంచ టోఫ్రీని దక్కించుకోవాలని చూస్తున్న దక్షిణాఫ్రికా విజయానికి మరో 69 పరుగుల దూరంలో నిలిచింది.

ఇక, లార్డ్స్ మైదానంలో 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం టెస్ట్ చరిత్రలో కేవలం మూడు సార్లు మాత్రమే సాధ్యం అయింది. 1984లో వెస్టిండీస్ 344 పరుగులను.. 2004లో ఇంగ్లాండ్ 282 పరుగులను.. 2022లో ఇంగ్లాండ్ 277 పరుగులను విజయవంతంగా ఛేదించింది. తాజాగా సౌతాఫ్రికా కూడా 282 రన్స్ టార్గెట్ చేధిస్తే.. దక్షిణాఫ్రికా ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరినట్లే.

Exit mobile version