టీమిండియా భవిష్యత్ స్టార్స్‌గా పేరు తెచ్చుకుంటున్నారు యంగ్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్. తమదైన శైలి ఆటతో ఇప్పటికే జట్టులో ప్లేస్ సుస్థిరం చేసుకున్నారు. అయితే వీరు బ్యాటింగ్‌లోనే కాదు యాక్టింగ్‌లోనూ దిట్టే. ఇప్పటికే వీరు చాలాసార్లు కొన్ని వీడియోలు చూసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. తాజాగా మరోసారి వీరు యాక్ట్ చేసిన ఓ షార్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీలో ఇలాంటి స్కిల్స్ కూడా ఉన్నాయా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో గిల్, ఇషాన్‌తో పాటు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా కనిపించాడు.
Also Read: Shocking : పార్కింగ్లోని బైకును ఢీకొట్టి.. 3కి.మీ మంటలొస్తున్నా లాక్కెళ్లాడు
న్యూజిలాండ్‌తో బుధవారం (ఫిబ్రవరి 1) చివరి టీ20 ముగిసిన తర్వాత హోటల్ గదిలో ఈ ఇద్దరూ కలిసి ఓ రియాల్టీ షోలోని సీన్‌ను రీక్రియేట్ చేశారు. ఇప్పుడీ ఫన్నీ వీడియో అభిమానులకు నవ్వు తెప్పిస్తోంది. ఈ ఇద్దరికి ఇండియన్ టీమ్‌లో అందరితోనూ సరదాగా ఉండే స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కూడా తోడయ్యాడు. ముగ్గురూ కలిసి ఎంటీవీలో వచ్చే రోడీస్ షోకు సంబంధించి ఆడిషన్ ఎపిసోడ్‌లో జరిగిన ఓ ఫన్నీ సీన్‌ను రీక్రియేట్ చేశారు. ఇందులో ప్రధానంగా ఇషాన్ యాక్టింగ్ సూపర్. అతడు గొరిల్లాలాగా మారి గిల్‌పై నుంచి దూకాడు. రోడీస్ షోలో తమ ఫేవరెట్ మూమెంట్‌ను రీక్రియేట్ చేశామంటూ ఈ వీడియోను గిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఈ వీడియో చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అభిమానులే కాదు శివమ్ మావి, కృనాల్ పాండ్యా, కమలేష్ నాగర్‌కోటి, రాహుల్ తెవాతియా, అంకిత రాజ్‌పుత్ లాంటి క్రికెటర్లు కూడా ఫన్నీ ఎమోజీలతో కామెంట్స్ చేశారు. న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1తో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి మ్యాచ్‌లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు అతడు కేవలం 63 బంతుల్లో 126 పరుగులు చేశాడు. దీంతో ఇండియా మొదట 234 రన్స్ చేయగా.. తర్వాత న్యూజిలాండ్‌ను 66 పరుగులకే కట్టడి చేసి 168 రన్స్ తేడాతో విజయం సాధించింది.