Shreyas Iyer Creates Sensational Record In ODI: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన సంగతి పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. వికెట్లు కోల్పోయి భారత్ కష్టకాలాల్లో ఉన్నప్పుడు.. మంచి ఇన్నింగ్స్ ఆడి, భారత్ స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లాడు. 102 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సుల సహాయంతో 82 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఒక అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 1500 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. మొత్తం 36 ఇన్నింగ్స్‌లలో అతడు 1500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే.. శ్రేయస్ 34 ఇన్నింగ్స్‌లలోనే 1500 పరుగులు సాధించి, అతని రికార్డ్‌ని బద్దలు కొట్టాడు.
ఇదే సమయంలో శ్రేయస్ మరో రికార్డ్‌ని కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది (2022)లో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా శ్రేయస్ నిలిచాడు. ఇప్పటివరకూ ఈ రికార్డ్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. అతడు ఈ ఏడాదిలో 658 పరుగులు సాధించాడు. అయితే.. తాజా మ్యాచ్‌తో ధావన్ రికార్డ్‌కు శ్రేయస్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాదిలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 721 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే.. తన అంతర్జాతీయ కెరీర్‌లో 38 వన్డేలు ఆడిన అయ్యర్, 1534 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత పది ఇన్నింగ్స్‌లలోనే శ్రేయస్ 5 అర్థశతకాలతో పాటు ఒక సెంచరీ సాధించాడు. దీన్ని బట్టి అతడు.. ఫుల్ ఫామ్‌లో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే.. కచ్ఛితంగా వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకోవచ్చు.
