NTV Telugu Site icon

Shikhar Dhawan: రాజకీయాల్లోకి వస్తా.. గబ్బర్ షాకింగ్ స్టేట్‌మెంట్

Shikhar Dhawan Politics

Shikhar Dhawan Politics

Shikhar Dhawan Shocking Statement On Politics: రాజకీయాలతో క్రీడా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రంగంలో బాగా రాణించి, పేరు ప్రఖ్యాతలు గడించిన వారు.. ఏదో ఒక సమయంలో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ప్రజల్లో వారికున్న గుర్తింపుని క్యాష్ చేసుకోవడం కోసం.. ఆయా పొలిటికల్ పార్టీలు వారిని ఆహ్వానిస్తుంటాయి. ఇలా ఇప్పటికే ఎంతోమంది క్రీడాకారులు పాలిటిక్స్‌లోకి వెళ్లడం, ఏదో ఒక ఉన్నత పదవిలో కొనసాగడం జరిగింది. ఇప్పటికీ కొందరు క్రీడాకారులు ఆయా రాజకీయ పార్టీల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా తాను రాజకీయాల్లోకి వస్తానంటూ టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఇచ్చిన స్టేట్‌మెంట్.. క్రికెట్‌తో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.

Ravi Kishan: ఆమె నన్ను రాత్రికి రమ్మంది.. అల్లు అర్జున్ విలన్ షాకింగ్ కామెంట్స్

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గబ్బర్ మాట్లాడుతూ.. భగవంతుడి చిత్తమై, తన విధిలో రాసిపెట్టివుంటే, తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని అన్నాడు. అయితే.. ప్రస్తుతానికి తనకు రాజకీయాలపై ఎలాంటి ప్లాన్స్ లేవని స్పష్టం చేశాడు. ఇంతవరకూ తనని ఏ రాజకీయ పార్టీ కూడా సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావడం దేవుడి చిత్తమైతే.. ఆ రంగంలోకి 100 శాతం ఎఫర్ట్ పెట్టి, తప్పకుండా సక్సెస్ సాధిస్తానని ధవన్ చెప్పుకొచ్చాడు. ఈ విధంగా రాజకీయాలపై ధవన్ వ్యాఖ్యలు చేయడంతో.. పొలిటికల్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అతడు కచ్ఛితంగా ఏదో ఒక రాజకీయ పార్టీతో టచ్‌లో ఉన్నాడని, అందుకే అతడు రాజకీయాల గురించి నోరు విప్పాడని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఫామ్‌లేమితో ధవన్ సతమతమవుతున్నాడని, ఇదే కొనసాగితే పక్కాగా క్రికెట్‌కి గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి వస్తాడని చెప్పుకుంటున్నారు.

Bribery Case: బ్యాగు నిండా డబ్బులు.. భార్య చేసిన పనికి షాక్

కాదా.. ఇదే ఇంటర్వ్యూలోనే ధవన్ తన టాటూపై జరిగిన రగడ గురించి కూడా చెప్పుకొచ్చాడు. తనకు 15 ఏళ్ల వయసున్నప్పుడు కుటుంబంతో కలిసి మనాలి టూర్‌కి వెళ్లానని, అప్పుడు ఎవ్వరికీ తెలియకుండా భుజంపై టాటూ వేసుకున్నానని చెప్పాడు. అయితే.. టాటూ వేయించుకున్నాక తనకు కొంచెం భయం కలిగిందని, ఎందుకంటే టాటూ వేసే వ్యక్తి ఓ సూదీతో వేశాడో తెలియదని తెలిపాడు. దాంతో తన తండ్రితో కలిసి వెళ్లి, హెచ్‌ఐవీ చేయించుకున్నానని, రిపోర్ట్ నెగెటివ్‌గా రావడంతో ఊపిరి పీల్చుకున్నానని గబ్బర్ వెల్లడించాడు.