NTV Telugu Site icon

టీంఇండియా కెప్టెన్సీపై స్పందించిన ధావన్…

శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా, భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. అయితే బీసీసీఐ తనను టీమిండియా కెప్టెన్​గా నియమించడం పై సోషల్ మీడియా వేదికగా శిఖర్​ ధావన్ స్పందించాడు. తన ట్విట్టర్ లో “దేశానికి నాయకత్వం వహించడం గొప్పగా భావిస్తున్నా. మీ అందరి విషెస్​కు ధన్యవాదాలు” అని ధావన్ ట్వీట్ చేశాడు. అయితే ధావన్ మొదటి సారి జట్టును నడిపించబోతున్నాడు. జూలై 13 నుంచి 25 వరకు మూడు టీ20, మూడు వన్డేలు ఆడడానికి భారత జట్టు లంకలో పర్యటించనుంది.

Show comments