Site icon NTV Telugu

Shikar Dhawan: ధావన్‌ను చితకబాదిన తండ్రి.. కారణం ఏంటంటే..?

Shikar Dhawan

Shikar Dhawan

ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌ ఫైనల్‌కు చేరింది. అయితే ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరడంలో పంజాబ్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌లలో కేవలం ఏడు విజయాలు మాత్రమే సాధించడంతో 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది. కెప్టెన్లు మారినా.. ఆటగాళ్లు మారినా.. ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను అతడి తండ్రి మహేంద్రపాల్ ధావన్ చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే తన తండ్రి తనను ఎందుకు కొట్టాడో ధావన్ వివరించాడు. పంజాబ్ టీమ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతోనే తన తండ్రి తనను కాలితో కొట్టారంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోకు పాత బాలీవుడ్ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ జత చేశాడు. కాగా ఈ వీడియోలో ధావన్ సోదరి శ్రేష్ట ధావన్ కూడా కనిపించింది.

IPL 2022: లక్నో ఔట్‌.. క్వాలిఫయర్‌-2కు ఆర్‌సీబీ

కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో బ్యాట్స్‌మన్‌గా శిఖర్ ధావన్ మరోసారి ఆకట్టుకున్నాడు. అతడు 14 మ్యాచులలో 460 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 88 నాటౌట్. కాగా ఓవరాల్ ఐపీఎల్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేయడం ధావన్‌కు ఇది ఏడోసారి. ఐపీఎల్‌లో రాణించినా సెలక్టర్లు టీ20లకు ధావన్‌ను ఎంపిక చేయడం లేదు. దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై టీమిండియా ఆడే సిరీస్‌ కోసం సెలక్టర్లు ధావన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.

https://www.instagram.com/shikhardofficial/?utm_source=ig_embed&ig_rid=9210280e-51eb-465a-b6b7-3df54b9eac8f

Exit mobile version