Site icon NTV Telugu

WI vs Pak: వెస్టిండీస్‌తో సిరీస్‌కు పాక్‌ జట్టు ప్రకటన.. బాబర్‌కు చుక్కెదురు.. అఫ్రిది రీఎంట్రీ!

Pak

Pak

WI vs Pak: వెస్టిండీస్‌తో త్వరలో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్‌ జట్లను ఈరోజు (జులై 25) ఆ దేశ బోర్డు ప్రకటించింది. టీ20 జట్టుకు సల్మాన్‌ అఘా, వన్డే జట్టుకు మహ్మద్‌ రిజ్వాన్‌ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఈ సిరీస్‌తో స్టార్‌ స్పీడ్‌స్టర్‌ షాహీన్‌ అఫ్రిది టీ20ల్లోకి మరోసారి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక, మాజీ సారథి బాబర్‌ ఆజమ్‌కు మళ్లీ చుక్కెదురైంది. సెలెక్టర్లు బాబర్‌కు వన్డేలకు మాత్రమే ఎంపిక చేశారు. అఫ్రిది రాకతో పాక్‌ టీ20 జట్టు పేస్‌ బౌలింగ్‌ విభాగం మరింత స్ట్రాంగ్ అయింది. అఫ్రిదికి జతగా హరీస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ టీ20 జట్టులో ఉన్నారు. అయితే, మరో పేసర్‌ నసీం షా వన్డేలకే పరిమితమయ్యాడు. ఇక, బ్యాటింగ్‌ విభాగంలో సైమ్‌ అయూబ్‌, ఫకర్‌ జమాన్‌, హసన్‌ నవాజ్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, మొహమ్మద్‌ నవాజ్‌ జట్టులో స్థానం దక్కించుకోగా.. అబ్దుల్లా షఫీక్‌ వన్డేలకే పరిమితం అయ్యాడు. కాగా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లో సత్తా చాటిన సల్మాన్‌ మీర్జా, అహ్మద్‌ దనియాల్‌కు ఇవాళ ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.

Read Also: Vishwambhara: కీరవాణి ఉండగా భీమ్స్ స్పెషల్ సాంగ్.. ఎందుకో తెలుసా?

విండీస్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ టీమ్..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హరీస్, మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొఖిమ్.

విండీస్‌తో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ టీమ్..
మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, నసీం షా, సైమ్ అయూబ్, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొఖిమ్.

Read Also: Mushrooms Price: కొండెక్కిన పుట్టగొడుగుల ధర..! చికెన్, మటన్‌తో పోటీ..

వెస్టిండీస్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ షెడ్యూల్‌..
టీ20 సిరీస్ (ఫ్లోరిడా):
జులై 31 – తొలి టీ20
ఆగస్ట్ 2 – రెండో టీ20
ఆగస్ట్ 3 – మూడో టీ20

వన్డే సిరీస్ (ట్రినిడాడ్):
ఆగస్ట్ 8 – తొలి వన్డే
ఆగస్ట్ 10 – రెండో వన్డే
ఆగస్ట్ 12 – మూడో వన్డే.

Exit mobile version