Singapore Open 2026: సింగపూర్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్.. టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ జోడీ
- సింగపూర్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ జోడీగా సత్విక్, చిరాగ్ చరిత్ర
- సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ జోడీ
- రెండేళ్ల తర్వాత తొలి టైటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్రిక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా జోడీ Fajar Alfian, Muhammad Shohibul Fikriలను ఓడించి, సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ జోడీగా నిలిచారు. ఫైనల్ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 18-21 తేడాతో కోల్పోయిన సాత్విక్-చిరాగ్ జోడీ అద్భుతంగా పుంజుకుంది. అనంతరం జరిగిన రెండో, మూడో గేమ్‌లలో వరుసగా 21-17, 21-16 స్కోర్లతో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
రెండేళ్ల తర్వాత తొలి టైటిల్
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
- Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జోడీ రెండేళ్ల తర్వాత తమ తొలి అంతర్జాతీయ టైటిల్‌ను గెలుచుకుంది. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని అద్భుతమైన ప్రదర్శన చేయగల తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. మ్యాచ్ మొత్తం భారత జోడీ పోరాట పటిమ, సమన్వయం, దూకుడు ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి గేమ్‌లో వెనుకబడినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తిరిగి పోటీలోకి రావడం వారి విజయానికి ప్రధాన కారణమైంది.
ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు
విజయం అనంతరం సాత్విక్-చిరాగ్ జోడీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. స్టేడియంలోని అభిమానుల మద్దతు తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొంది.
“గతంలో మేము కొన్ని కీలక మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. కానీ ఈ టోర్నమెంట్ మా కోసం ప్రత్యేకమైనదిగా నిలిచింది. ప్రేక్షకుల మద్దతు అద్భుతంగా ఉంది. ఎవరు ఆడుతున్నారన్నది పక్కనపెట్టి ప్రతి మ్యాచ్‌ను మీరు ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. మేము ఆడిన అత్యుత్తమ స్టేడియంలలో ఇది ఒకటి. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని వారు తెలిపారు.
భారత బ్యాడ్మింటన్‌కు మరో గర్వకారణం
సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా సాత్విక్-చిరాగ్ జోడీ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో మైలురాయిని నమోదు చేసింది. ప్రపంచ స్థాయి టోర్నమెంట్లో భారత జోడీ సాధించిన ఈ ఘన విజయం దేశ బ్యాడ్మింటన్ అభిమానులకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, రాబోయే అంతర్జాతీయ పోటీలకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందించింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!