NTV Telugu Site icon

Virat Kohli: కోచ్ అంటే ఇలా ఉండాలి.. నెట్టింట్లో వీడియో వైరల్

Virat Kohli Sanjay Bangar

Virat Kohli Sanjay Bangar

ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. రెండు మ్యాచుల్లో పర్వాలేదనిపించాడు కానీ, మిగిలిన మ్యాచెస్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. నిజానికి.. ఈసారి కోహ్లీ అదరగొడతాడని, తన రాయల్ ఛాలెంజర్స్ జట్టుని ఛాంపియన్‌గా నిలబెడతాడని ఫ్యాన్స్ ఎంతో ఆశించారు. కానీ, అందుకు భిన్నంగా ఇతడు పేలవ పెర్ఫార్మెన్సెస్‌తో ఆ ఆశల్ని నీరుగారుస్తున్నాడు. ఈ సీజన్‌లో అతడు మూడుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడంటే, అతని ప్రదర్శన ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ మూడోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో అతడు విసుగు, కోపం కలగలిసిన చిరునవ్వుతో క్రీజును వీడుతూ.. డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. అప్పుడు అతడ్ని ఓదార్చేందుకు ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళాడు. తల నిమురుతూ, మరేం పర్లేదన్నట్టుగా ఊరట కలిగించాడు. ఇలాంటివన్ని సహజమేనని అతనిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు.. ‘‘కోచ్‌ అంటే ఇలా ఉండాలి.. కోహ్లి పట్ల సంజయ్ వ్యవహరించిన తీరుకు హ్యాట్సాఫ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలావుండగా.. హైదరాబాద్, బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. డుప్లెసిస్ (73) మెరుపు ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలవగా, అతనికి రజత్‌ పాటిదార్‌(48), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(33) సహాయంగా నిలిచారు. చివర్లో వచ్చిన దినేశ్ కార్తిక్ విధ్వంసం సృష్టించాడు. 8 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌.. 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆర్సీబీ బౌలర్‌ వనిందు హసరంగ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి.. రైజర్స్‌ పతనాన్ని శాసించాడు.

What a gesture by Sanjay Bangar after Kohli's dismissal. #RCBvsSRH #ViratKohli pic.twitter.com/PHdGEbI0Pj
— Avneet ⍟ (@Avneet_Shilpa) May 8, 2022

Show comments