NTV Telugu Site icon

Sania Mirza : మక్కాలో సానియా మీర్జా ఉమ్రా.. ఆ మాటలకు అర్థం ఏంటో తెలుసా..?

Sania Mirza

Sania Mirza

భారత టెన్సిస్ స్టార్ సానిమా మీర్జా ఇటీవలే ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మాజీ టెన్నిస్ ప్లేయర్ తన కుమారుడుని, ఇంటిని చూసుకోవడానికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఓ ఫోట్ వైరల్ అవుతోంది. ఆమె సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించారు. రంజాన్ పర్వదినానికి ముందు ఉమ్రా చేసేందకు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సానియా నిండుగా బురఖా ధరించి కనిపించారు. ఆమెతో పాటు కుమారుడు ఉన్నాడు. అయితే సానిమా మిర్జా భర్త, పాకిస్థాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్ మాత్రం వీరితో కనిపంచలేదు. అంతేకాదు, సానిమా తన మక్కా సందర్శనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ పోస్ట్ కు ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read : Revanth reddy: నిరుద్యోగ నిరసనకు పిలుపు.. రేవంత్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌..

అల్లాహ్.. మా ప్రార్థనలను వింటాడు అని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో సానిమా మీర్జా పోస్ట్ చేసింది. ఆమె ఏం కోరుకొని ఉంటారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. భర్త సోయబ్ తో సానియాకు భేదాభిప్రాయాలు ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సానియా ఏదైనా కీలక నిర్ణయం తీసుకున్నారా అని సందేహం వ్యక్తం అవుతుంది. మొహమ్మదీయుల జీవితంలో పవిత్ర స్థలాలను సందర్శించడం ఒక ముఖ్యమైన భాగం.. సాధారణంగా వీరు మక్కాను సందర్శిస్తారు.. ఈ యాత్రను ఉమ్రా ఉంటారు. అయితే రంజాన్ మాసంలో మక్కాకు వెళ్లడాన్ని హజ్ యాత్ర అని పిలుస్తారు. సాధారణ రోజుల్లో ఈ యాత్రకు వెళితే దాన్ని ఉమ్రా అని పిలుస్తారు. మక్కా సందర్శించి, దాన ధర్మాలు చేస్తే శుభం కలుగుతుందని వీరు నమ్ముతారు.

Also Read : Kakani Govardhan Reddy: క్రాస్ ఓటింగ్ చేసిన వారికి శిక్ష తప్పదు

రంజాన్ పర్వదినానికి ముందు మక్కా సందర్శన సానియా మీర్జాకు ప్రత్యేకమైనదే.. ఆమె పోస్ట్ పై సెలబ్రిటీలు, అభిమానులు స్పందిస్తున్నారు. వీరిలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, బాలీవుడ్ నటి హుమా ఖురేషీ కూడా ఉన్నారు. సానియా పోస్టుపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ అమీన్ అంటూ రాశారు. సానియా స్నేహితురాలు, నటి హుమా ఖురేషీ మూడు హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది. అల్లా మీ ప్రార్థనలన్నింటినీ అంగీకరించాలి అని టీవి నటి, హోస్ట్ రక్షందా ఖాన్ పేర్కొన్నారు. అల్లా ఆమె ( సానియా మీర్జా ) ఆశీర్వాదాలు వినాలని, సర్వశక్తిమంతుడు ఆమె ప్రార్థనలను స్వీకరించాలని ఆశిస్తున్నాను అంటూ పలువురు నెటిజన్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. టెన్నిస్ టోర్మెంట్లలో అనేక గ్రాండ్ స్లామ్ లను గెలుచుకున్న సానియా తన ఆటతో ఎంతో మంది అభిమానులను, స్నేహితులను సంపాదించుకుంది. బాలీవుడ్ లో ఫరాఖాన్, హుమా ఖురేషీ, వరుణ్ ధావన్ లాంటి ప్రముఖులతో ఆమెకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి.