Sania Mirza:భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దాయాది పాకిస్తాన్ కి చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోయిన సంగతి తెల్సిందే. సానియా మీర్జా స్వస్థలమైన హైదరాబాద్‌లో ఏప్రిల్ 2010లో షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. అనంతరం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో వీరి వలీమా జరిగింది. కొన్నాళ్లు దుబాయ్‌లో గడిపిన ఈ జంటకు 2018లో ఇజాన్ పుట్టాడు. 10 ఏళ్ల పాటు వీరి బంధం బాగానే సాగింది. సానియా, షోయబ్ మధ్య సంబంధాలు చాలా కాలం క్రితమే దెబ్బతిన్నాయి. ఎప్పటినుంచో వీరు విడాకులు తీసుకున్నారు అన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ గత శనివారం షోయబ్.. తన మూడో ప్రియురాలు అయిన నటి సనా జావెద్ ను వివాహమాడి షాక్ ఇచ్చాడు. అనంతరం సానియా కుటుంబం.. వారి విడాకులు కన్ఫర్మ్ చేసింది. “సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి వెళ్లకుండా గోప్యంగా ఉంచుతుంది. అయితే క్లిష్ట పరిస్థితుల్లో స్పందించక తప్పట్లేదు. షోయబ్, సానియా విడాకులు తీసుకొని కొన్ని నెలలు అవుతోంది. షోయబ్ కొత్త జీవితం బాగుండాలని విష్ చేసింది. సానియా తన జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుంది. ఈ సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు అండగా నిలవాలి. ఆమె గోప్యతకు ఎటువంటి భంగం కలిగించకుండా గౌరవించాలి. అనవసర చర్చలు ఆపేయండి” అని చెప్పుకొచ్చింది.
ఇక విడాకుల తరువాత సానియా సోషల్ మీడియాలో మొట్ట మొదటి పోస్ట్ పెట్టింది. నేడు రిపబ్లిక్ డే సందర్భంగా.. జాతీయజెండాతో ఉన్న ఆమె పాత ఫోటోను షేర్ చేస్తూ.. ” మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గౌరవంగా భావిస్తాను.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు” అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్స్ మిశ్రమ కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడ ఇలాంటిది ఏదో జరుగుతుందని ఉహించాము.. నువ్వు తప్పు చేశావ్ సానియా.. ఒక పాకిస్తానీని పెళ్లాడకుండా ఉండాల్సింది అని కొందరు..ధైర్యంగా ఉండు సానియా.. నీ వెనుక భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారు అని ఇంకొందరూ కామెంట్స్ చేస్తున్నారు.
