కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్‌లో అదరగొడుతోంది, విమెన్స్ డబుల్స్‌లో నిరాశ పర్చినా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి సూపర్ పెర్ఫామెన్స్‌తో దూసుకెళ్తోంది. అద్భుత ఆటతీరుతో దూసుకుపోతున్న సానియా – బోపన్న జోడీ సెమీఫైనల్‌లో బ్రిటన్, అమెరికాకు చెందిన నీల్ సుపాస్కి-డిసీర్ క్రాజిక్‌లపై 7-6, 6-7, 10-6 తేడాతో విజయాన్ని సాధించి గ్లాండ్‌స్లామ్ ఫైనల్‌లో అడుగుపెట్టారు. క్వార్టర్స్‌లో వాకోవర్ లక్‌తో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సానియా-బోపన్న జోడి.. సెమీస్‌లో పాయింట్ పాయింట్‌కి పోరాడాల్సి వచ్చింది. గంటా 52 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగిందంటే ఉత్కంఠ ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. తొలి రెండు సెట్లు టై బ్రేకర్‌కు దారి తీయగా.. సానియా జోడీ తొలి సెట్, నీల్-క్రాజిక్ జోడీ రెండో సెట్ గెలుచుకున్నాయి. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ అయితే సూపర్ టై బ్రేకర్‌కు దారి తీసింది. కానీ చివరకు ఈ భారత్ వెటరన్ జోడినే విజయం వరించింది. శనివారం జరగనున్న ఫైనల్‌లో స్టెఫానీ-మాథోస్‌లతో సానియా – బోపన్న తలపడనున్నారు.
కెరీర్‌లో సానియా మీర్జాకు ఇదే చివరి గ్లాండ్‌స్టామ్ టోర్నమెంట్. ఫిబ్రవరిలో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు ఇటీవలే సానియా స్పష్టం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచి కెరీర్‌ను ఘనంగా ముగించే అవకాశం సానియాకు లభించింది. ఫైనల్‌లో సానియా – బోపన్న జోడి ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకుంది సానియా. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఒకసారి, మరోసారి విమెన్స్ డబుల్స్‌లో విజేతగా నిలిచింది. మరో మూడు సార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
సానియా భావోద్వేగం
కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న సానియా మ్యాచ్ సమయంలోనూ, గెలిచిన తర్వాత చాలా ఎమోషనల్‌గా కనిపించింది. ఇది అద్భుతమైన మ్యాచ్ అని.. ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నామంటూ మ్యాచ్ తర్వాత సానియా తెలిపింది. తన చివరి గ్రాండ్‌స్లామ్‌లో బోపన్నతో ఆడడం ప్రత్యేకంగా ఉందని.. ఇప్పుడు తనకు 36 ఏళ్లు.. బోపన్నకు 42 ఏళ్లు.. మేమింకా ఆడుతున్నామంటూ ఎమోషనల్ అయ్యింది. తాను సాధారణంగా ఏడ్చేదాన్ని కాదు అని.. అయితే ఇప్పుడు ఆ ఫిలింగ్‌ను ఆపుకుంటున్నానంటూ ఏడ్చినంత పని చేసింది సానియా. తన కొడుకును ఎత్తుకుని గట్టిగా హగ్ కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ఫుల్ వైరల్‌గా మారింది.
Wholesome content alert 👶@MirzaSania's son, Izhaan, ran out on court to celebrate her reaching the #AusOpen mixed doubles final 🥰#AO2023 pic.twitter.com/VLiHGSRgiN
— #AusOpen (@AustralianOpen) January 25, 2023