Site icon NTV Telugu

కరోనా బాధితులకు అండగా నిలిచిన సచిన్

Tollywood Stars wish the cricket legend Sachin Tendulkar on his Birthday

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల ఆక్సిజన్ కొరతతో బాధ పడుతున్న వారికి సహాయం చేసేందుకు మిషన్ ఆక్సిజన్ అనే సంస్థకు తన వంతుగా కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. 250 మందికి పైగా యువకులతో మిషన్ ఆక్సిజన్ సంస్థ వైరస్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు పనిచేస్తోంది. దేశంలో మొదటిసారి కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళాన్ని అందజేసిన సచిన్.. ప్రస్తుతం మరోసారి తన గొప్ప మనసు చాటుకోవడంతో మాస్టర్ పై ఫాన్స్ ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. మరీ కొందరు అయితే మిగతా క్రికెటర్లు కూడా దేశం కోసం సహాయం చేయాలని కామెంట్స్ పెడుతున్నరు.

Exit mobile version