పూణె వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఆదిలోనే ఆ జట్టు వరుస వికెట్లను కోల్పోయింది. బట్లర్ (8), పడిక్కల్ (7) విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ సంజు శాంసన్ (27) కొంచెం సహనంగా ఆడాడు. అయితే మళ్లీ వరుస వికెట్లు పడటంతో రాజస్థాన్ స్వల్ప స్కోరుకే అవుటవుతుందని అందరూ భావించారు.
కానీ ర్యాన్ పరాగ్ నిలబడ్డాడు. అతడు చివరి వరకు క్రీజులో ఉండి హాఫ్ సెంచరీతో రాణించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 56 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హేజిల్‌వుడ్, హసరంగ తలో రెండు వికెట్లు సాధించారు. హర్షల్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. గత మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయిన బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో వేచి చూడాలి.
