NTV Telugu Site icon

Ryan Burl: ఒకే ఓవర్‌లో 6 6 6 6 4 6.. అదరగొట్టిన జింబాబ్వే క్రికెటర్

Ryan Burl

Ryan Burl

Ryan Burl: బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్‌ ర్యాన్‌ బర్ల్‌ అదిరిపోయే రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సులు, ఓ ఫోర్ బాది మొత్తంగా 34 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. సెన్సేషనల్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. స్పిన్నర్‌ నసుమ్‌ అహ్మద్‌ వేసిన 15వ ఓవర్‌లో ర్యాన్‌ బర్ల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొదటి నాలుగు బంతులను సిక్సులుగా మలిచిన ర్యాన్‌.. ఆ తర్వాతి బంతికి ఫోర్‌ సాధించాడు. చివరి బంతికి ఏమవుతుదా అని ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ఆ బంతిని ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లేట్లు సిక్సర్‌ బాదాడు. దీంతో ఒకే ఓవర్‌లో 34 పరుగులు సాధించి అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

అంతకంటే ముందు భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆరు బంతులకు ఆరు సిక్సులు బాదిన సంగతి తెలిసిందే. ఆపై విండీస్‌ వీరుడు కీరన్‌ పొలార్డ్‌ సైతం శ్రీలంక బౌలర్‌ అకిల ధనంజయపై విరుచుకుపడి 36 పరుగులు రాబట్టాడు. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ టిమ్‌ సైఫర్ట్‌, భారత యువ ఆటగాడు శివమ్‌ దూబే 34 పరుగులు సాధించగా.. తాజాగా ర్యాన్‌ బర్ల్‌ ఆ జాబితాలో చేరాడు.

Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో భారత్.. నేడు జరిగే పోటీలు

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను జింబాబ్వే 2-1తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మొదటి రెండు మ్యాచుల్లో చెరో జట్టు గెలుపొందగా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో జింబాబ్వే 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బర్ల్‌ హాఫ్ సెంచరీతో జట్టుని ఆదుకున్నాడు. బర్ల్ 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు. న్యూచీ 20 బంతుల్లో 35 పరుగులతో విజృంభించడంతో జట్టు స్కోరు 156కు చేరింది. 157 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 146 పరుగులకే పరిమితమైంది.

Show comments