NTV Telugu Site icon

తాను నటితో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న రూమర్ల పై స్పందించిన గైక్వాడ్

ఐపీఎల్ లో రుతురాజ్ గైక్వాడ్‌ చెన్నై సూపర్ కింగ్స్ తరపున గత సీజన్‌తో లో అరంగేట్రం చేశాడు. కరోనా బారిన పడి జట్టుకు దూరమైన గైక్వాడ్‌ సీజన్ ఎండింగ్‌తో దుమ్ములేపాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ ఓ సీరియల్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. మరాఠా సీరియల్ నటి సయాలి సంజీవ్‌తో గైక్వాడ్‌ ప్రేమలో మునిగిపోయాడంట. తాజాగా సయాలి సంజీవ్ ఇన్‌ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలపై రుతురాజ్ గైక్వాడ్ కామెంట్ చేశాడు. వావ్.. లవ్లీ అంటూ పోస్ట్ చేశాడు. హీరోయిన్ కూడా లవ్ సింబల్స్‌తో ఉన్న ఏమోజీలతో రిప్లే ఇచ్చింది. దాంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఈ వార్తల పై రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ”బౌలర్లు తప్ప మరేవరూ తనను క్లీన్ బౌల్డ్ చేయలేరని పరోక్షంగా మరాఠీలో కామెంట్ చేశాడు. ‘కేవలం బౌలర్లు మాత్రమే నా వికెట్ తీయగలరు. అది కూడా క్లీన్ బౌల్డ్ చేయలగలరు. మరెవరికీ ఇది సాధ్యం కాదు. అర్థం అయిన వారికి, అర్థం కావాల్సిన వారికే ఈ విషయం” అని పేర్కొన్నాడు. దాంతో ఈ రూమర్స్‌కు బ్రేక్ పడినట్లు అయింది.