Royal Challengers Bangalore Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్సీబీ టాస్ గెలవగా, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు కేకేఆర్ రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఈ ఇరుజట్ల మధ్య ఆల్రెడీ ఈడెన్ గార్డెన్స్ వేదికగా పోరు జరిగింది. ఆ పోరులో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో.. ఆ మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ జట్టుతో పాటు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరోవైపు.. ప్లేఆప్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే, కోల్‌కతా ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే.. ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
అయితే.. ఆర్సీబీ జట్టులో ముగ్గురు బ్యాటర్లే కీలకంగా ఉంటూ వస్తున్నారు. వాళ్లే.. విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్. ఈ సీజన్‌లో బ్యాటింగ్ విషయంలో ఈ ముగ్గురే లాక్కొస్తున్నారు. ఒకవేళ వీళ్లు ఔటైతే మాత్రం.. పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురు మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. బౌలింగ్ విషయంలో ఆర్సీబీ కాస్త పర్వాలేదు. మరీ పటిష్టంగా బౌలింగ్ లైనప్ లేదు కానీ, కొంతలో కొంత బాగానే రాణిస్తారు. అటు.. కోల్‌కతా సమస్య ఏంటో తెలీదు కానీ, హార్డ్ హిట్టర్లు, స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్నా పరాజయాలు మూటగట్టుకుంటోంది. ఈ మ్యాచ్‌లోనూ వాళ్లు పేలవ ప్రదర్శన కొనసాగిస్తే మాత్రం.. ఆర్సీబీకి చేజేతులా మ్యాచ్ ఇచ్చేసినట్టు అవుతుంది. చూద్దాం.. ఈ ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో ఏ విధంగా రాణిస్తారో?
