Site icon NTV Telugu

KKR vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఆర్సీబీ

Rcb Vs Kkr

Rcb Vs Kkr

Royal Challengers Bangalore Won The Toss And Chose Bowling: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 9వ మ్యాచ్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. కేకేఆర్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఒక ఓటమిని చవిచూసిన కేకేఆర్ జట్టు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందాలని కసి మీద ఉంది. పైగా హోమ్‌గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి.. కేకేఆర్ సత్తా చాటాలని చూస్తోంది.

Pune Crime News: అనుమానంతో దారుణానికి ఒడిగట్టిన బావ.. మరదలితో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా..

మరోవైపు.. ఆర్సీబీ ఈ సీజన్‌లో ఇప్పటికే ఒక విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో.. ఆ జట్టు నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో ఛేధించింది. ఇదే జోరుని కొనసాగించాలని ఆర్సీబీ భావిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ విజృంభిస్తే.. ఆర్సీబీకి తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు. కేకేఆర్‌తో పోలిస్తే.. ఆర్సీబీ పట్టే కాస్త పటిష్టమైనది. కాబట్టి.. సమిష్టిగా సత్తా చాటితేనే, కోల్‌కతా ఆర్సీబీపై పూచేయి సాధించగలదు. ఎక్కడైనా తేడా జరిగితే మాత్రం.. మ్యాచ్ ఆర్సీబీ చేతికి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుపొందుతారో?

Haryana Girl Neelam Case: ప్రేమ కోసం కెనడా నుంచి వస్తే.. దారుణంగా కాల్చి చంపాడు

కేకేఆర్: మన్‌దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), నితీష్ రాణా(కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

Exit mobile version