Site icon NTV Telugu

IPL 2022 : ఆర్‌సీబీ టార్గెట్‌ 152..

Mi Rcb

Mi Rcb

ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ రోజు మధ్యాహ్నం ఎస్‌ఆర్‌హెచ్‌, సీఎస్‌కే ల మధ్య జరిగిన పోరుతో ఆరెంజ్‌ ఆర్మీ సత్తా చాటి విజయం కేతనం ఎగురవేసింది. అయితే రాత్రి 7.30 గంటలకు ఆర్‌సీబీ, ముంబాయి ఇండియన్స్‌ మధ్య పోరు మొదలైంది. అయితే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇంకా బోణీ కొట్టకపోవడంతో ఈ మ్యాచ్‌లోనైనా గెలుపే లక్ష్యంగా ఆడుతున్నారు.

అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు సాధించింది. అయితే ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 37 బంతుల్లో 68 నాటౌట్‌, 5 ఫోర్లు, 6 సిక్సర్లు అద్బుత పోరాటం కనబరిచాడు. అయితే తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్‌సీబీని పరుగులు తీయకుండా కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌ సెట్‌ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసేందుకు ముంబాయి ఇండియన్స్‌ ఆలోచిస్తున్నారు.

Exit mobile version