Site icon NTV Telugu

RCB vs KKR: డేంజర్ జోన్‌లో ఆర్సీబీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Rcb 10 Overs Innings

Rcb 10 Overs Innings

Royal Challengers Bangalore Scores 96 Runs In First 10 Overs: కోల్‌కతా నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొంచెం డేంజర్ జోన్‌లో ఉందని చెప్పుకోవాలి. అఫ్‌కోర్స్.. తొలి 10 ఓవర్లలో 96 పరుగులు చేసినా, మూడు కీలక వికెట్లు మాత్రం కోల్పోయింది. తొలుత ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న డు ప్లెసిస్.. 17 వ్యక్తిగత పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత షాబాజ్ ఇలా క్రీజులోకి వచ్చినట్టే వచ్చి, వెనుదిరిగాడు. అనంతరం.. వచ్చి రాగానే ఫోర్ కొట్టి ఊరించిన మ్యాక్స్‌వెల్, ఆ వెంటనే క్యాచ్ ఔట్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బ్యాట్‌కి పని చెప్పడం మొదలుపెట్టిన కోహ్లీ.. ఆచితూచి ఆడుతూనే, వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు.

Uppal Skywalk : ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉప్పల్ స్కైవాక్

ప్రస్తుతం క్రీజులో కోహ్లీతో పాటు లామ్రోర్ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సీజన్‌లో ఒక్కసారి కూడా మంచి ఇన్నింగ్స్ ఆడని లామ్రోర్, ఈ మ్యాచ్‌లో మాత్రం బాగా రాణిస్తున్నాడు. ఫోర్లు, సిక్సులతో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. కోహ్లీకి మద్దతు ఇస్తూనే.. తనకు అనుకూలమైన బంతులు దొరికినప్పుడల్లా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్సీబీ గట్టెక్కాలంటే.. వీళ్లిద్దరే చివరి వరకు రాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక్కరు ఔటైనా, ముఖ్యంగా కోహ్లీ ఔటైతే మాత్రం ఆర్సీబీ పని అయిపోయినట్టే! ఎందుకంటే.. అతని తర్వాత ఈ జట్టులో మెరుగ్గా రాణించే ఆటగాళ్లు ఎవ్వరూ లేరు. కాబట్టి.. కోహ్లీ చాలా జాగ్రత్తగా ఆడాలి. జట్టుని గెలిపించాల్సిన బాధ్యత ఇప్పుడు అతని మీదే ఉంది. మరి.. కోహ్లీ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Exit mobile version