Site icon NTV Telugu

Rohit – Dhawan: మరో అరుదైన ఫీట్.. రెండో స్థానం సొంతం

Rohit Dhawan Creates Record

Rohit Dhawan Creates Record

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సొంతం చేసుకోవడంతో పాటు పలు రికార్డులు కూడా నమోదు చేసింది. ఇంగ్లండ్‌పై తొలిసారి పది వికెట్ల తేడాతో, అది కూడా అతి తక్కువ ఓవర్లలోనే విజయం సాధించిన జట్టుగా.. భారత చరిత్రపుటలకెక్కింది. బౌలర్లైన బుమ్రా, షమీలు సైతం తమ ఖాతాలు రికార్డ్స్ వేసుకున్నారు. ఇక బ్యాటింగ్ విషయంలో రోహిత్‌ శర్మ – శిఖర్‌ ధావన్‌ ద్వయం కూడా ఓ అరుదైన ఫీట్ సాధించింది.

ఇంగ్లండ్ నిర్దేశించిన 111 లక్ష్యాన్ని చేధించేందుకు ఓపెనర్లుగా దిగిన రోహిత్, ధవన్.. ఆచితూచి ఆడుతూ, ఒక్క వికెట్ పడకుండా భారత్‌ని గెలిపించిన విషయం తెలిసిందే! ఓవైపు శిఖర్ చేయూతనందిస్తే, మరోవైపు రోహిత్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. దీంతో 18.4 ఓవర్లలో 114 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించారు. ఈ క్రమంలోనే ఈ ఓపెనింగ్‌ జోడి 5 వేల పరుగుల మైలురాయిని దాటేసింది. ఫలితంగా.. సచిన్ – గంగూలీ జోడి తర్వాత వన్డేల్లో తొలి వికెట్‌కు 5 వేల పరుగులు జోడించిన రెండో ఓపెనింగ్ జోడిగా రోహిత్ – ధవన్ ద్వయం చరిత్రకెక్కింది. 114 ఇన్నింగ్స్‌లో ఈ ద్వయం ఈ ఘనత సాధించింది.

సచిన్ – గంగూలీ ద్వయం 136 ఇన్నింగ్స్‌లో 6609 పరుగులు చేసి.. ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు. వీరి తర్వాతి రెండో స్థానంలో మాథ్యూ హేడెన్‌ – ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472) జోడి ఉండగా.. మూడో స్థానంలో పెయిర్‌ గార్డన్‌ గ్రీనిడ్జ్‌ – డెస్మండ్‌ హేన్స్‌ (02 ఇన్నింగ్స్‌ల్లో 5150) ద్వయం ఉంది. తాజాగా వీరి సరసన రోహిత్‌ శర్మ – ధావన్‌ జోడి చేరిపోయింది.

Exit mobile version