NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్ శర్మ మరో మైలురాయి.. 6వ బ్యాటర్‌గా రికార్డ్

Rohit Sharma Milestone

Rohit Sharma Milestone

Rohit Sharma Reaches Another Milestone In International Cricket: టీమిండియా సారథి రోహిత్ శర్మ తాజాగా ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేల పరుగుల క్లబ్‌లోకి చేరాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. దీంతో.. 17 వేల పరుగుల మైల్‌స్టోన్‌ని అందుకున్న ఆరవ భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 34, 357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (25, 047), రాహుల్ ద్రవిడ్ (24,064), సౌరవ్ గంగూలీ (18,433), ఎంఎస్ ధోనీ (17,092) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నారు. ధోనీ రికార్డ్‌కి మరికొన్ని పరుగుల దూరంలోనే ఉన్నాడు కాబట్టి.. త్వరలోనే అతడ్ని రోహిత్ అధిగమించేస్తాడు. అప్పుడు ధోనీని వెనక్కు నెట్టేసి.. ఐదవ స్థానంలోకి రోహిత్ ఎగబాకుతాడు.

Arjun Reddy: ఛీ ఛీ.. ఇలాంటి సినిమా చేసిందా.. అర్జున్‌రెడ్డిపై స్వప్న షాకింగ్ కామెంట్స్

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఉస్మాన్ ఖ్వాజా (180), కేమరాన్ గ్రీన్ (114) అద్భుత సెంచరీలు చేయడంతో, ఆసీస్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. శనివారం శుభ్మన్ గిల్‌తో కలిసి భారత తొలి ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రోహిత్ శర్మ.. 58 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 35 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్మన్‌తో కలిసి తొలి వికెట్‌కి 74 పరుగులు జోడించాడు. అయితే.. మాథ్యూ బౌలింగ్‌లో మార్నస్‌కి క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్, పుజారా క్రీజులో ఉన్నారు.

Tammareddy Bharadwaja: నేను నోరు విప్పితే, అందరి బాగోతాలు బయటపడతాయి.. తమ్మారెడ్డి వార్నింగ్

Show comments