Rohit Sharma 21 Records: ఒక్క సెంచరీ.. 21 రేర్ రికార్డ్స్.. లార్డ్స్‌లో రఫ్ఫాడించిన రోహిత్ శర్మ!

  • మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌
  • 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు
  • ఒక్క ఇన్నింగ్స్‌తో 21 అరుదైన రికార్డులు
Rohit Sharma 21 Records

Rohit Sharma 21 Records

Rohit Sharma 21 Records List: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. భారత్ మ్యాచ్‌ను, సిరీస్‌ను చేజార్చుకున్నప్పటికీ.. హిట్‌మ్యాన్ సెంచరీ మాత్రం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేసిన రోహిత్.. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ఏకంగా 21 అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డుల లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.

క్రికెట్‌కు మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఎన్నో దిగ్గజాలు ఆడిన ఈ మైదానంలో ఇప్పటివరకు ఏ భారత బ్యాటర్ కూడా వన్డేల్లో శతకం నమోదు చేయలేదు. అలాగే 39 సంవత్సరాల 80 రోజుల వయసులో వన్డే సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయసు గల భారత ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్‌లో 50కి పైగా పరుగులు చేసిన అత్యంత వయసు గల భారత ఆటగాడిగానూ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ ఇంగ్లండ్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా నిలిచాడు.

రోహిత్ శర్మ 21 అరుదైన రికార్డులు:
1 ఓ విదేశీ దేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్ (ఇంగ్లండ్‌లో 8 సెంచరీలు)
2 ఇంగ్లండ్‌పై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన భారత బ్యాటర్ (9 సెంచరీలు)
3 వన్డే లక్ష్య ఛేదనల్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు (17 సెంచరీలు)
4 ఇంగ్లండ్‌పై అత్యధిక వన్డే సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ (61 సిక్సర్లు)
5 ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్‌పై భారత బ్యాటర్ చేసిన అత్యధిక వన్డే స్కోరు (138 పరుగులు)
6 సేన దేశాలపై (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక రన్స్ చేసిన తొలి ఆసియా ఓపెనర్ (9,000 అంతర్జాతీయ పరుగులు)
7 సేన దేశాల్లో 15 వన్డే సెంచరీలు చేసిన తొలి బ్యాటర్
8 అత్యధిక వయసులో వన్డే సెంచరీ చేసిన భారత బ్యాటర్ (39 సంవత్సరాలు, 80 రోజులు)
9 ఇంగ్లండ్‌లో 50+ వన్డే స్కోరు చేసిన అత్యధిక వయసు గల భారత బ్యాటర్ (39 సంవత్సరాలు, 80 రోజులు)
10 ఇంగ్లండ్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన విదేశీ బ్యాటర్ (1,603 పరుగులు)
11 సేన దేశాలపై అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు (346 సిక్సర్లు)
12 ఇంగ్లండ్‌లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానం (30 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు)
13 లార్డ్స్‌లో వన్డే సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్
14 ఇంగ్లండ్‌లో 10 అంతర్జాతీయ సెంచరీలు చేసిన రెండో విదేశీ బ్యాటర్ (డాన్ బ్రాడ్‌మన్ 11 తర్వాత)
15 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ (46 సెంచరీలు)
16 సేన దేశాల్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆసియా బ్యాటర్ (15 సెంచరీలు)
17 ఒకే విదేశీ దేశంలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లలో రెండో స్థానం (ఇంగ్లండ్‌లో 10 సెంచరీలు)
18 ఇంగ్లండ్‌లోని 8 వేర్వేరు వేదికల్లో వన్డే సెంచరీలు చేసిన తొలి విదేశీ బ్యాటర్
19 భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ (37 ఇన్నింగ్స్‌లు)
20 అత్యంత వేగంగా 34 వన్డే సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్ (280 ఇన్నింగ్స్‌లు-విరాట్ కోహ్లీ – 197 తర్వాత)
21 ఇంగ్లండ్‌లో విదేశీ బ్యాటర్‌గా అత్యధిక 50+ వన్డే స్కోర్లు (30 ఇన్నింగ్స్‌ల్లో 15 సార్లు (విరాట్ కోహ్లీతో సమం))