ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ రెండో సెమీస్ లో పాకిస్థాన్ జట్టుతో ఆస్ట్రేలియా జట్టు తలపడుంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టే తన ఫెవరెట్ అని భారత ఆటగాడు రాబిన్ ఉతప్ప చెప్పాడు. అయితే ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు పాకిస్థాన్ అని చెప్పిన ఉతప్ప.. అందుకే వారు ఈ మ్యాచ్ లో తన ఫెవరెట్ అని చెప్పాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు… ప్రత్యేకంగా ఐసీసీ ట్రోఫీలను గెలవడానికి ఏమి అవసరమో వారికి తెలుసు. అంతేకాకుండా ఆ జట్టులో ఓపెనర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే సమతుల్య బౌలింగ్ దాడి ఉన్న ఆసీస్ ఏ జట్టునైనా ఓడించగలరు అని చెప్పాడు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.
సెమీస్ లో పాకిస్థాన్ ఫెవరెట్ అంటున్న ఉతప్ప…
