Rohit Sharma: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా రోహిత్ శర్మ నిలిచారు. ఇక, 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. హిట్ మ్యాన్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి సారథ్య బాధ్యతలను యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది. అయితే, రోహిత్ హయంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అలాగే, 2018, 2023లో రెండుసార్లు ఆసియా కప్‌ను దక్కించుకుంది.
Read Also: Mahesh Babu : AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు ముహుర్తం ఫిక్స్ !
ఇక, 2017 నుంచి 2025 అక్టోబరు 4వ తేదీ వరకు వన్డే కెప్టెన్‌గా కొనసాగిన రోహిత్ శర్మ రికార్డులు చూస్తే.. అతడి సారథ్యంలో ఆడిన 56 వన్డే మ్యాచ్‌లలో భారత్ ఏకంగా 42 మ్యాచుల్లో గెలిచింది. అంటే, రోహిత్ విజయాల శాతం ఏకంగా 76 శాతం ఉంది. ఈ విషయంలో భారత క్రికెట్‌లోని దిగ్గజ కెప్టెన్లు అయిన సౌరభ్ గంగూలీ (51.70%), ఎం.ఎస్.ధోని (55%), విరాట్ కోహ్లీ (68.42%), కపిత్ దేశ్(53%) కంటే హిట్‌మ్యాన్ పర్సెంటేజీనే ఎక్కువగా ఉండటం విశేషం.
Read Also: Gold Rate Today: భయపెడుతున్న బంగారం ధరలు.. నేడు రూ. 1250 పెరిగిన పసిడి ధర..
అయితే, ఆస్ట్రేలియా టూర్‌కు ప్లేయర్ గానే ఎంపికై రోహిత్ శర్మ.. ఇకపై వ్యక్తిగత ప్రదర్శనతోనే తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. 2027 ప్రపంచకప్ నాటికి రోహిత్ వయస్సు 40 ఏళ్ల వస్తాడు. ఈ వయస్సులో ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఫామ్ కొనసాగించడం చాలా కష్టం. ఇక, కెప్టెన్సీ ఒత్తిడిలోనూ రోహిత్ దూకుడుగా ఆడాడు. అలాంటిది.. ప్లేయర్ గా బరిలోకి దిగుతున్న అతడు.. మళ్లీ పాత రోహిత్ శర్మను గుర్తు చేసే అవకాశం ఉంది. తన సహచరుడు విరాట్ కోహ్లీ మాదిరిగానే బ్యాటింగ్‌లో మరింత స్వేచ్ఛగా, దూకుడుగా చెలరేగిపోయే ఛాన్స్ ఉంది.
Read Also: Bihar Assembly Election 2025: నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
కాగా, వన్డేల్లో ఒక డబుల్ సెంచరీ చేయడమే కష్టమైన రోజుల్లో.. రోహిత్ శర్మ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు సాధించి ‘హిట్‌మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూడింటిలో రెండు, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకముందే వచ్చాయి. ఇక. మూడోది మాత్రం కెప్టెన్ అయ్యాక ఆడిన రెండో వన్డేలోనే కొట్టాడు. అంటే, నాన్- కెప్టెన్ బ్యాటర్‌గా రోహిత్ శర్మ మరింత ప్రమాదకారం అని చెప్పొచ్చు. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ ఫామ్, ఫిట్‌నెస్‌పై పూర్తి క్లారిటీ రానుంది.
