RCB Won The Match Against Mumbai Indians: ఎమ్. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. ముంబై కుదర్చిన 172 పరుగుల లక్ష్యాన్ని.. ఇంకా 3.4 ఓవర్లు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో ఛేధించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (82 నాటౌట్), ఫాఫ్ డు ప్లెసిస్ (73) రప్ఫాడించేశారు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎటాక్‌ని చీల్చిచెండాడారు. మైదానంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే ఈ ఇద్దరు దంచికొట్టడంతో.. ముంబై బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిలోనే కట్టుదిట్టమైన బౌలింక్ వేయలేక, తడబడ్డారు. ఈ ఇద్దరి ఆటతీరు చూసి.. వీళ్లే మ్యాచ్‌ని ముగించేస్తారని అంతా అనుకున్నారు. అయితే.. అర్షద్ ఖాన్ 148 పరుగుల వద్ద డు ప్లెసిస్ వికెట్ తీసి, ఆ జోడీని విడగొట్టాడు. ఆ వెంటనే వచ్చిన దినేశ్ కార్తిక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అప్పుడు రంగంలోకి దిగిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. రెండు సిక్సులు బాది, మ్యాచ్‌ని ముగించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మొదటినుంచి అద్భుతమైన ఆటతీరు కనబర్చడం, భారీ వ్యక్తిగత స్కోరు చేయడంతో.. మైదానం మొత్తం కోహ్లీ నినాదాలతో హోరెత్తింది. సోషల్ మీడియాలోనూ అతడ్ని ఆకాశానికెత్తేస్తున్నారు.
Yuzvendra Chahal: చాహల్ తిప్పేశాడు.. సరికొత్త చరిత్ర సృష్టించాడు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్ ధాటికి ముంబై టాపార్డర్ ఘోరంగా విఫలమైనా.. యువ ఆటగాడు తిలక్ వర్మ మాత్రం చీల్చి చెండాడాడు. ఎంతో శ్రద్ధగా, పద్ధతిగా బ్యాటింగ్ చేస్తూ.. ముంబై స్కోరు బోర్డును పరుగులు పట్టించాడు. మొదటి పది ఓవర్లలో 55/4 ఉన్న ముంబై స్కోరు 171/7కి చేరిందంటే.. అది తిలక్ వర్మ పుణ్యమే! ఓవైపు వికెట్లు పడుతున్నా, అతడు మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా, అనవసరమైన షాట్ల జోలికి వెళ్లకుండా, చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. బంతులు దొరికినప్పుడల్లా భారీ షాట్లు బాదాడు. మరో యువ ఆటగాడు నేమాల్ వాధేరా (21) కూడా కాసేపు మెరుపులు మెరిపించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. ఈ ఇద్దరు మంచి భాగస్వామ్యం జోడించి, జట్టుని ఆదుకున్నారు. అయితే.. వీరు పడ్డ కష్టం మొత్తం నీరుగారిపోయింది. ముంబై ఇండియన్స్ బైలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయకపోవడంతో.. ఆర్సీబీ సునాయాసంగా విజయం సాధించింది.
IPL: ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన 10 మంది ఆటగాళ్లు