ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది. ఈరోజు రాత్రికి జరిగే మ్యాచ్ నాలుగో బెర్తును ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కథ ముగుస్తుంది. అందుకే ముంబై ఇండియన్స్ జట్టు గెలవాలని ఆర్సీబీ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
అటు ఓవరాల్ ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ జట్టు గెలిచినా ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ ఈరోజు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టే గెలవాలని ఆర్సీబీ అభిమానులు మనసారా కోరుకుంటున్నారు. ప్లే ఆఫ్స్‌లో ప్లేస్ కోసం ఆర్సీబీ ఇప్పుడు ముంబైనే సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీని ముంబై చిత్తుచిత్తుగా ఓడించాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిగో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు ఇలా ఆర్సీబీ జెర్సీ వేసి సపోర్ట్ చేస్తున్నారు.
How #RCB fans see Rohit Sharma today😝#RCB fans. predict Rohit Sharma's runs v Delhi today😛 pic.twitter.com/BThrB9nabk
— CricTracker (@Cricketracker) May 21, 2022
